కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు ఉరిశిక్ష..? ఇక్కడే అసలు ట్విస్ట్
చిత్ర పరిశ్రమలోనే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా కూడా రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిత్రహింసలకు గురి చేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్.. నటి పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ఈ కేసులోనే అరెస్టైన దర్శన్ కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నా అంటూ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును కోరడంతో బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే ఆయన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీంతో మళ్ళీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బళ్లారి జైలు నుంచి బెంగుళూరు లోని పరప్పన అగ్రహార జైలుకి తరలించారు.

ఉరిశిక్ష..
అయితే పలు కారణాల వల్ల దర్శన్ ను తిరిగి బళ్లారి లోని జైలుకి మార్చాలని అధికారులు బెంగళూరులోని 64వ సెషన్స్ కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టులో విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి అతనికి ఉరిశిక్ష విధించండి అంటూ నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఊహించని ఘటనతో అక్కడి వారంతా షాక్ అయినట్టు తెలుస్తోంది.
కాగా ఆ తర్వాత కోర్టులోకి వచ్చిన అజ్ఞాత వ్యక్తితో జడ్జి మాట్లాడి.. సదరు ఘటన పట్ల ఆరా తీసినట్టు చెబుతున్నారు. అంతే కాకుండా ఆ వ్యక్తి అందించిన దరఖాస్తుని అంగీకరించలేనని.. కేసు ఏదైనా సరే ఆ వ్యక్తి పిటీషన్ ద్వారా దరఖాస్తు తీసుకుంటేనే స్వీకరిస్తానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
తీర్పు రిజర్వ్..
మరోవైపు దర్శన్‌ను బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను.. అలాగే జైలులో కనీస సౌకర్యాల కల్పనకు సంబంధించి దర్శన్ స్వయంగా పెట్టుకున్న పిటిషన్లపై సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు సెప్టెంబర్ 9న తీర్పును రిజర్వ్ చేసింది. దర్శన్ న్యాయవాదులు పరుపు, దిండు, దుప్పటి వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కర్ణాటక ఖైదీల చట్టం కింద నిబంధనలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు మాత్రమే వర్తిస్తాయని, విచారణలో ఉన్న ఖైదీలకు కాదని SPP ప్రసన్న కుమార్ వివరించారు. వార్తాపత్రికలు, పుస్తకాలు అనుమతించినప్పటికీ, హత్య వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పరుపు, దిండు వంటి సౌకర్యాలు అనుమతించబడవని ఆయన వాదించారు.
ఇక ఈ హత్య కేసులో జూన్ 8 నుంచి దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తానికి ఇప్పటివరకు 15 మంది నిందితులను గుర్తించగా.. కేసు విచారణ త్వరలోనే పూర్తికానుంది. ఈ పరిస్థితుల్లో మరి హీరో దర్శన్ కు ఉరిశిక్ష విధిస్తారా? లేక మరేదైనా శిక్ష విధిస్తారా అని సర్వత్రా చర్చ నడుస్తోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications