సెంట్రల్ జైల్లో భజన చేస్తున్న స్టార్ హీరో, ఉదయం జిమ్, రాత్రి హనుమాన్ జపం, రాగిముద్దతో ?
ఇన్‌స్టాగ్రామ్‌లో తన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు చిత్రదుర్గ రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ హీరో దర్శన్ బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార జైలులో జైలు విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇరవై రోజులుగా జైలు జీవితానికి అలవాటుపడిన హీరో దర్శన్ స్టోరీలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి.
షూటింగ్ బ్రేక్ లో ఎంజాయ్ చేసిన హీరో దర్శన్ ఇప్పుడు ఆ అలవాటు పడకుండా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. హీరో దర్శన్ ఒక్క క్షణం కూడా జైలు జీవితం గడపలేకి ఇబ్బంది పడుతున్నాడని వెలుగు చూసింది. ఇంతకాలం మందు
పార్టీలు, సినిమా షూటింగులతో ఉల్లాసంగా గడిపిన హీరో దర్శన్ ఇప్పుడు హఠాత్తుగా ఓ హత్య కేసులో చిక్కుకుని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని నాలుగు గోడల మధ్య గడుపుతున్నాడు.

ఒక్కొక్క క్షణం డీబాస్ దర్శన కు ఒక్కొ సంవత్సంలా అనిపిస్తుందని జైలు సిబ్బంది అంటున్నారు. జైలు అంటే పెద్ద శిక్ష అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజూ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినే దర్శన్ శరీరం ఇప్పుడు రాగి ముద్ద, పులుసు, చపాతీ, అన్నం, సాంబార్ తింటే ఆ శరీరం తట్టుకోగలదా ? అని ఆయన అభిమానులు అంటున్నారు. జైలు జీవితానికి అలవాటు పడలేక, తిన్న జైలు ఆహారం జీర్ణం కాలేక ఫుడ్ పాయిజన్ అవుతోందని, వాంతులు, విరేచనాల వల్ల బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఇప్పటికే హీరో దర్శన్ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు.
ఈ కారణంగా దర్శన్ ఆయన ఇంటి నుంచి భోజనం తెప్పించుకుని తినేందుకు అనుమతించాలని దర్శన్ తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
హీరో దర్శన్ ప్రతి రోజు ఒక సంవత్సరం లాగా గడుపుతున్నాడు. అలా టైమ్ పాస్ చేయడానికి హీరో దర్శన్ కొత్త అలవాటు చేసుకుంటున్నాడని వెలుగు చూసింది. అదేమిటంటే జైల్లో రోజూ మెడిటేషన్, భజన చేసేందుకు దర్శన్ సిద్ధమయ్యాడని, జైలులో రోజూ భజన చేస్తున్నాడని తెలిసింది.
పరప్ప అగ్రహార జైలులో చేరిన తర్వాత దర్శన్ చాలా మారిపోయాడని, ఆయన దినచర్య మాత్రమే కాదు, ఆయన మాటతీరులోనూ, ప్రవర్తనలోనూ పూర్తి మార్పు వస్తుందని జైలు అధికారులు అంటున్నారు.
ఉదయాన్నే ఫ్రీ ఎక్సర్ సైజ్, డిప్స్ చేస్తూ ఫిట్‌నెస్ కు పెద్దపీట వేస్తున్న దర్శన్ జైల్లో ఎవరితోనూ మాట్లాడటం లేదని, బదులుగా అతను ఒక పుస్తకం చదువుతున్నాడని, సాయంత్రం అవుతుండగా హనుమాన్ చాలీసా చదువుతున్నాడని, రోజూ భజన చేస్తూ దేవుడిని జపిస్తూ కాలం గడుతున్నాడని జైలు అధికారులు చెప్పారని కన్నడ మీడియా అంటోంది.












Click it and Unblock the Notifications