సెంట్రల్ జైల్లో అమ్మను తలుచుకుని కుమిలిపోతున్న హీరో, భార్యకు ఫోన్ చేసి ?
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా జైలులో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ సుమారు మూడు నెలల పాటు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు, బళ్లారి సెంట్రల్ జైళ్లలో గడుపుతున్నాడు. కన్నతల్లికి దూరంగా ఉన్న దర్శన్ ఇప్పుడు అమ్మను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నాడు. భార్యతో ఫోన్‌లో మాట్లాడిన హీరో దర్శన్ నువ్వు వచ్చేసారి అమ్మని తీసుకురమ్మని చెప్పడంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.
బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్ జైలు కాల్ సిస్టమ్ ద్వారా తన భార్య విజయలక్ష్మితో మాట్లాడారని కన్నడ మీడియా తెలిపింది. హై సెక్యూరిటీ సెల్ నుంచి జైలు కాల్ సిస్టమ్ ద్వారా భార్య విజయలక్ష్మితో ఐదు నిమిషాల పాటు మాట్లాడిన హీరో దర్శన్ తదుపరి న్యాయపోరాటంపై చర్చించారని తెలిసింది. ఆ తర్వాత భార్యతో మాట్లాడుతూ హీరో దర్శన్ ఆయన తల్లిని తలుచుకుని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడని కన్నడ మీడియా తెలిపింది.

భార్య విజయలక్ష్మి ఎందుకు అలా అయిపోయావని ప్రశ్నించగా నువ్వు జైలుకు వచ్చే సమయంలో అమ్మని కూడా వెంట తీసుకురావాలని దర్శన్ చెప్పాడని సమాచారం. ఇదిలా ఉండగా దర్శన్ కుటుంబ సభ్యులు కూడా ఆయన భార్య పరామర్శకు వచ్చే విషయంపై జైలు అధికారులకు సమాచారం అందించారు. నిందితుడు దర్శన్ భార్య విజయలక్ష్మి, అతని తల్లి మీనా బుధవారం బళ్లారి సెంట్రల్ జైలుకు వెళ్లి హీరో దర్శన్ తో భేటీ అవుతారని తెలిసింది.
హత్య కేసులో అరెస్టు అయిన హీరో దర్శన్ బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడని ఆరోపణలు ఉన్నాయి. హీరో దర్శన్ సెంట్రల్ జైలులో రౌడీషీటర్లతో కలిసి కుర్చుని దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో కలకలం రేపింది. సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బందిపై తీవ్ర విమర్శలు రావడంతో హీరో దర్శన్ ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. భార్య, కుమారుడితో పాటు కుటుంబ సభ్యులకు దూరం అయిన హీరో దర్శన్ బళ్లారిలో జైలులో దిగులుగా ఉన్నాడని తెలిసింది.












Click it and Unblock the Notifications