స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ??

ఆవేశాన్ని ఆపుకోగలం కానీ.. అభిమానాన్ని ఆపుకోలేం సార్.. అనే సినిమా డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఏదైనా హద్దు మీరితే బాగోదు అని అంటుంటారు. కానీ ఈ తరహా ఘటనలు జరుగుతున్న ప్రతిసారీ వీరిది అభిమానం అనుకోవాలో.. లేక మరి ఏం అనాలో అర్ధం కావట్లేదు కానీ.. మళ్లీ మళ్లీ ఇలాంటి విషయాలే జరుగుతూ రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఇన్నాళ్లు హీరోయిన్స్ కోసం, రాజకీయ నాయకుల కోసం.. కన్న తల్లిదండ్రుల కోసం లేదా బిడ్డల కోసం గుడి కట్టిన ఘటనలు చూస్తే ఇప్పుడు అభిమాన హీరో కోసం కూడా గుడి కట్టాడు ఓ వీరాభిమాని. దీంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అసలేంటి స్టోరీ..

కన్నడ స్టార్ హీరో సుదీప్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సూపర్ స్టార్ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించిన సుదీప్, ఇతర భాషలలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు పాన్-ఇండియా స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో నాని హీరోగా నటించిన " ఈగ " సినిమాలో.. తమిళంలో Puli చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇలాంటి క్రేజ్ ఉన్న Kichcha Sudeepకు తాజాగా ఒక అభిమాని గుడి కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

kannada-star-hero-sudeep-fan-constructed-a-temple-and-photos-goes-viral-on-social-media

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని Doddajjanur గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. జీవనోపాధి కోసం ఐస్ క్యాండీలు అమ్ముకునే రోజువారీ కూలీ అయిన Siddaraju తన ఆరాధ్య నటుడిపై ఉన్న అపారమైన అభిమానంతో ఈ గుడిని నిర్మించడం విశేషం. ఈ ఆలయంలో Kichcha Sudeep విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆసక్తికరంగా, ఈ గుడిలో మహర్షి వాల్మీకి, మడకరి నాయక వంటి సాంస్కృతిక, చారిత్రక ప్రముఖుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. సుదీప్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ఈ విధంగా వ్యక్తం చేయడం తన కల నెరవేరినట్టేనని సిద్ధరాజు తెలిపారు.

అంతేకాకుండా, సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే హీరోల సినిమా విడుదల రోజున భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేయడం.. పటాకులు కాల్చడం వంటి ఫ్యాన్ కల్చర్ దక్షిణ భారతదేశంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సుదీప్‌కు గుడి కట్టడం ఆయనపై అభిమానులకున్న ప్రేమను మరోసారి చాటిచెబుతోంది.

ఇక గతంలో తమిళ స్టార్ Rajinikanth, అలాగే Khushbu కోసం అభిమానులు గుడులు నిర్మించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా Nandamuri Balakrishna, Samantha Ruth Prabhu వంటి సెలబ్రిటీలకు అభిమానులు ఆలయాలు నిర్మించడం లేదా పాలాభిషేకాలు చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ గుడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+