ఓటీటీలోకి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు..!
టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం జూన్ 27న విడుదలైంది. ఈ చిత్రం థియేటర్ల వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రుద్ర పాత్రపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ మూవీని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ భారీ స్థాయిలో తెరకెక్కించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు లాంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్ట్ 4 నుంచి ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటించిన చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తోనే ఇప్పటివరకు రూ. 600 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. సెప్టెంబర్ 11 న ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని ప్రైమ్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.

ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది సు ఫ్రమ్ సో మూవీ. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 115 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రముఖ నటుడు రాజ్ బీ శేట్టియు ఇందులో ప్రధాన పాత్రలో కనిపించడమే కాకుండా, ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అలాగే జేపీ తుమినాద్ రచన, దర్శకత్వం చేశాడు. ఈ చిత్రం ఈ నెల 5 వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
-
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
మూవీకి నో చెప్పానని ఆ డైరెక్టర్ అలా చేశారు.. ఫుల్‌గా ఏడ్చేశా - మెగా కోడలు -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
మరో హిట్ సినిమాతో వస్తున్న యంగ్ హీరో..ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ మామ -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’












Click it and Unblock the Notifications