బాక్సాఫీస్ దుమ్ము దులిపిన 'కన్నప్ప'.. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, 'కన్నప్ప' మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూలు చేసి, మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'కన్నప్ప'కు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు వెర్షన్‌లో 55.89% ఆక్యుపెన్సీని నమోదు చేసుకోగా, రాత్రి షోలకు 69.87% ఆక్యుపెన్సీతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో భారీ వసూళ్లు నమోదయ్యాయి.

ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి అగ్ర తారల క్యామియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మిశ్రమ సమీక్షలు వచ్చినా, భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, నటీనటుల అద్భుత ప్రదర్శనలు సినిమాకు కలిసొచ్చాయి. ఇది మంచు విష్ణు కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది.












Click it and Unblock the Notifications