Kantara Chapter 1 : బాక్సాఫీస్ ఊచకోత..ఫస్ట్ డే ఎన్ని కోట్లో తెలుసా..?

కన్నడ సెన్సేషన్ రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని మాస్ జాతరను సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, మొదటి రోజు వసూళ్లు ఎలా ఉంటాయోనని ఎదురుచూసిన సినీ విశ్లేషకులకు ఈ సినిమా షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.సినిమాకు మొదటి షో నుంచే యూనానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో, కలెక్షన్ల లెక్కలు ఒక్కసారిగా తారుమారయ్యాయి.

షో షోకి వసూళ్లు పెరగడంతో, 'కాంతార చాప్టర్ 1' అనతి కాలంలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచే దిశగా దూసుకుపోతోంది. నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ కూడా తోడవడంతో, సినిమా సెన్సేషనల్ రాంపేజ్‌ను చూపిస్తోంది. ప్రారంభంలో గ్రాస్ లెక్క ప్రకారం రూ. 60 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ ఉంటాయని అంచనా వేసినా, తాజా ట్రెండ్‌ను బట్టి ఆ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రస్తుతం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 85-90 కోట్ల మార్క్ను దాటే అవకాశం ఉంది.

Kantara Chapter 1 Box Office Record Rishab Shetty s Film Targets 100 Crore Opening Day

ముఖ్యంగా హిందీలో నైట్ షోల ట్రెండ్ మరింత సాలిడ్‌గా కొనసాగితే, తొలి రోజు వసూళ్లు ఏకంగా రూ. 100 కోట్లను టార్గెట్ చేయడమే కాక, మించే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'కాంతార 1' దేశీయ మార్కెట్లలో సైతం అద్భుతమైన జోరు చూపిస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మిగిలిన చిత్రాలను డామినేట్ చేస్తూ, అంచనాలను మించిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది.

హిందీలో ముందు అనుకున్న అంచనాలను మించిపోయి, రూ. 20 కోట్ల నెట్ కలెక్షన్స్ లేదా అంతకుమించి వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. సినిమా సొంత గడ్డ అయిన కర్ణాటకలో ఈవినింగ్, నైట్ షోలలో సెన్సేషనల్ హోల్డ్‌తో దూసుకుపోతోంది. తమిళనాడులో ఓపెనింగ్స్ అదిరిపోగా, కేరళలో హోల్డ్ చేసిన తీరు మాత్రం మరో లెవల్‌లో ఉందని చెప్పాలి. మొత్తంగా, పాజిటివ్ టాక్ పవర్ అండ్ హాలిడే అడ్వాంటేజ్‌ను పూర్తిగా వాడుకుంటూ, 'కాంతార చాప్టర్ 1' మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్లతో ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+