'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్
సినీ అభిమానులు, ముఖ్యంగా రిషబ్ శెట్టి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'కాంతార చాప్టర్ 1'. 'కాంతార' (Kantara) అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో, హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ (దాదాపు ₹125 కోట్లు) చిత్రం అంచనాలను పతాక స్థాయికి చేర్చింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే, దీనిపై వచ్చిన ఒక 'ఫస్ట్ రివ్యూ' సోషల్ మీడియాలో కలకలం రేపింది.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి.. సెప్టెంబర్ 29 నాడే ఒక వివాదాస్పద సినీ విమర్శకుడు ఉమైర్ సంధు తన ట్విట్టర్ (X) ఖాతాలో రివ్యూ పోస్ట్ చేశాడు. కాంతార చాప్టర్ 1 సినిమా అస్సలు బాలేదు. మెరిసేవన్నీ బంగారాలు కాదు. ఈ సినిమా కూడా ఓవర్ హైప్ తో తీసిన విచిత్రమైన సినిమా అని తేల్చేశారు.

సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు బాలీవుడ్‌లో వివాదాస్పద రివ్యూలకి పెట్టింది పేరు. ఇతను తన గురించి పెద్దగా వివరాలు వెల్లడించకపోయినా, వివిధ స్టార్స్‌తో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ, సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్‌లను డిసైడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను చెప్పిన రివ్యూల ఫలితాలు చాలాసార్లు తారుమారయ్యాయి. దీంతో 'కాంతార చాప్టర్ 1' సినిమాపై ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ఫేక్ అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
First Review #KantaraChapter1 !
— Umair Sandhu (@UmairSandu) September 29, 2025
All that glitters is not gold ! Overrated & Weird kind of film.
🌟🌟
ఇక సినిమా విషయానికొస్తే, 'కాంతార చాప్టర్ 1'పై అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'కాంతార' ఏకంగా రూ.400 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అందుకే, హోంబలే ఫిలిమ్స్ ఈ ప్రీక్వెల్‌పై భారీగా ఖర్చు పెట్టింది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో బుధవారం రాత్రి నుంచే 'కాంతార చాప్టర్ 1' ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.












Click it and Unblock the Notifications