'కాంతారా చాప్టర్ 1' కు సెన్సేషనల్ బిజినెస్.. ఎన్టీఆర్ సినిమాను దాటేసి..
2022 లో సాధారణ చిత్రంగా విడుదలై సంచలనం సృష్టించింది కన్నడ సినిమా ' కాంతారా'. కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ లో విడుదలైన ఈ మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దాదాపు రూ. 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసి ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా నిలిచింది. కన్నడ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో చిత్రంగానూ నిలిచింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయనున్నట్లు నిర్మాతలు ఇది వరకే ప్రకటన చేశారు.
'కాంతారా- చాప్టర్ 1' అనే టైటిల్ తో రానున్న ఈ మూవీకి కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు కాంతారా సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ రిషబ్ శెట్టి కు ఉత్తమ నటుడు క్యాటగిరీలో నేషనల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం 'కాంతారా- చాప్టర్ 1' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇక ఈ మూవీ రిలీజ్ కు ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరుగుతున్న ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 95 కోట్ల వరకు జరిగిందని తెలుస్తుంది. ఓ ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఈ మూవీకి అంతకు మించిన బిజినెస్ జరగడం హాట్ టాపిక్ గా మారింది.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications