ఓటీటీలోకి రూ. 1000 కోట్ల సినిమా.. రిలీజైన నెల రోజులకే..
ఇటీవల బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది కాంతార చాప్టర్ 1 మూవీ. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2 న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. రిలీజైన 27 రోజుల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 900 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. 2025 లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడు మూవీ సయారా ను.. కాంతార చిత్రం దాటేసింది. కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ.. విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ. 850 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. రూ. 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.
OTT📢#KantaraChapter1 - Prime - Oct 31 pic.twitter.com/G6fismoV5A
— Filmy Fanatic (@FanaticFilmy) October 27, 2025
ఇక ఈ మూవీని కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే మరోవైపు హీరోగా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఇక ఈ మూవీలో రుక్మిణి వాసంతో హీరోయిన్ గా నటించింది. ఇతర నటులు జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. హొంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాంతార చాప్టర్ 1 సినిమాను రూ. 125 కోట్లతో నిర్మిస్తే రూ. 850 కోట్ల వరకు వసూళ్లు రాబట్టడం విశేషం.

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్ కాంతారా చాప్టర్ 1 మూవీని అక్టోబర్ 31 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో దుమ్ములేపిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందోనని ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత రిషబ్ శెట్టి జై హనుమాన్ చిత్రంలో నటించనున్నాడు. ఆ తర్వాత కాంతార చాప్టర్ 2 చిత్రం చేయనున్నట్లు ఇటీవల పేర్కొన్నాడు.
-
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!











Click it and Unblock the Notifications