Kantara Chapter 1: బాక్సాఫీస్‌ను షేక్ ఆడించే ట్రైలర్ వచ్చేసింది..మెంటల్ మాస్ అంతే..!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'కాంతార'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, దర్శకత్వం, సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది.

కాంతార సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అజనీష్‌ లోక్‌నాథ్ సంగీతం కథకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా 'వరహా రూపం' పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Kantara Chapter 1 Trailer Released Rishab Shetty Set to Recreate History

రిషబ్ శెట్టి దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలు ఈ సినిమాకు మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. "కాంతార 2" కథ మొదటి భాగం కథకు ముందు జరిగే కథగా ఉంటుంది. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది."కాంతార" మొదటి భాగం భారీ విజయం సాధించింది. దీనికి తగ్గట్టుగా "కాంతార 2" కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'కాంతార' యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కాంతార మాదిరిగానే 'కాంతార చాప్టర్ 1' సైతం గ్రాండ్‌గానే తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. సినిమాకు మూలకథలను 'కాంతార చాప్టర్ 1'లో చూపించే ప్రయత్నం చేశాడు రిషబ్ శెట్టి.

పాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పంపిణీ చేస్తుండగా, నైజాంలో మైత్రీ ఫిల్మ్స్ విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు భారీ వసూళ్లు వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ స్థాయిలో విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం తర్వాత, 'కాంతార చాప్టర్ 1' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+