తమన్నాకు ఖరీదైన ఫ్లాట్ రాసిచ్చిన స్టార్ హీరో
తమన్నాకు ఓ స్టార్ హీరో ఖరీదైన ఫ్లాట్ రాసిచ్చారనే వార్త గతంలో వైరల్ గా మారింది. 2010లో తమన్నా-కార్తీ జంటగా నటించిన ఆవారా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ద్వారానే కార్తీకి తెలుగులో మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే చెన్నైలో ఉన్న ఓ ఖరీదైన ఫ్లాట్ ను తమన్నాకు బహుమతిగా ఇచ్చాడని తమిళ మీడియాలో హాట్ టాపిక్ గా వార్త వైరల్ అయింది.
మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికి వాటిని పట్టించుకోకుండా అందులోనే కలిసి జీవించడం మొదలుపెట్టారు. తర్వాత ఈ విషయం కార్తీ తండ్రి, ప్రముఖ నటుడు శివకుమార్ దగ్గరకు చేరింది. అప్పటికే పెద్ద కొడుకు సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఇంకో హీరోయిన్ ను ఇంటికి తీసుకురావడం ఏమాత్రం ఇష్టంలేదు. ఈ కారణంగానే కార్తీ ఇంట్లో గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో తనవల్ల ఇంట్లో గొడవలవుతున్నాయని భావించిన కార్తీ అయిష్టంగా తమన్నాకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది.

తన తండ్రి ఇష్టం ప్రకారం 2011లో బంధువుల అమ్మాయి అయిన రజినీని వివాహం చేసుకున్నాడు. కార్తీతో విడిపోయిన తర్వాత తమన్నా కొద్దిరోజులు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ సంఘటన నుంచి కోలుకొని సినిమాలపై దృష్టి సారించింది. కార్తీ ఇచ్చిన ఫ్లాట్ ను తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుంది. కానీ దాన్ని తీసుకునేందుకు అతను అంగీకరించలేదు. ఇప్పటికీ ఆ ఫ్లాట్ చెన్నైలో తమన్నా పేరుమీదే ఉంది. ఇటీవలే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగివున్నట్లు తమన్నా తెలిపింది. వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications