Karthika deepam 2 November 25th:జ్యోత్స్న కొత్త కుట్ర-దాస్ వార్నింగ్..!!
కార్తీకదీపం 2 సీరియల్‌లో కార్తీక్-దీపల జీవితంలో ఊహించని శుభవార్త, జ్యోత్స్న పాలిట పెనుశాపంగా మారింది. గత ఎపిసోడ్‌లో దీప స్పృహ కోల్పోవడం, డాక్టర్ ఆమె గర్భవతి అని ప్రకటించడంతో శివన్నారాయణ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ప్రెగ్నెంట్ అంటే ఏమిటో సుమిత్ర వివరించడంతో శౌర్య తల్లిని ఆప్యాయంగా పలకరించి ధన్యవాదాలు చెప్పింది.
జ్యోత్స్న కొత్త కుట్ర, దాస్ వార్నింగ్:
దీప తల్లి కాబోతుందన్న వార్త విని జ్యోత్స్న షాక్‌లో ఉండిపోతుంది. "కార్తీక్ బిడ్డకు జన్మనిస్తే, తన కలలు సమాధి అయినట్లే" అని పారిజాతంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. "ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు, దీపే ఆ వారసురాలా?" అని జ్యోత్స్న ఆందోళన పడుతుంది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన దాస్, "ఎదుటివారిని తక్కువ అంచనా వేయొద్దు, విర్రవిగితే నాశనమే. అన్ని మనం అనుకున్నట్లు జరగవు" అంటూ జ్యోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయితే, ఇష్టం లేకపోయినా బంధువుల దృష్టిలో చెడ్డవారు కాకూడదనే ఉద్దేశంతో, పారిజాతం ఒత్తిడి మేరకు జ్యోత్స్న దీపకు శుభాకాంక్షలు చెబుతుంది.

కాంచన వెటకారం, కార్తీక్ కౌంటర్:
"మా అమ్మే దీప కడుపులో పుడుతుంది" అని కాంచన సంతోషిస్తుండగా, పారిజాతం వెటకారంగా, "మీ అమ్మకు జ్యోత్స్న వారసురాలు కాబట్టి, ఆమెకు పెళ్లయ్యాక ఆమె కడుపులో పుడుతుంది" అని కౌంటర్ ఇస్తుంది. దానికి, "మీ అమ్మమ్మ జ్యోత్స్న కడుపులో పుడుతుందని నీతో ఏమైనా చెప్పిందా" అని కార్తీక్ దీటుగా బదులిస్తాడు. అనంతరం, దీప-కార్తీక్ గురువుగారి ఆశీర్వాదం తీసుకుంటారు.
గురువుగారి విపత్తు హెచ్చరిక:
దశరథ, సుమిత్రలను ఉద్దేశించి "కొంచెం జాగ్రత్తగా ఉండాలి" అని గురువుగారు హెచ్చరించడంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అవుతుంది. హోమం జరిగింది జరగబోయే విపత్తుకు ఉపశమనమే తప్ప, సమూలంగా నిర్మూలించడానికి కాదని గురువుగారు స్పష్టం చేయడంతో శివన్నారాయణ భయాందోళన చెందుతాడు. ప్రమాదం ఎవరికైనా, ఏ రూపంలోనైనా రావొచ్చని హెచ్చరిస్తూ, "కొన్నింటికి మీరు సిద్ధంగా ఉండాలి" అని గురువుగారు వెళ్లిపోతారు.
దాస్ కీలక నిజాలు:
మరోవైపు, దీప తల్లిదండ్రులు లేకుండా పోయారని అనసూయ బాధపడగా, కార్తీక్ అడ్డుకుని, "దీపకు అత్తామామలే అమ్మానాన్నలు. నన్ను 'నాన్న' అని పిలిచినందుకు మావయ్య కూడా తండ్రి అవుతాడు" అని అంటాడు. అనంతరం, దాస్‌తో పర్సనల్‌గా మాట్లాడిన జ్యోత్స్న, తన నిజం బయటపడకుండా ఉంటే చాలని బతిమాలుతుంది. దానికి దాస్, "నువ్వు అన్నింటికీ తెగించావు కానీ, నిజం అదే బయటపడుతుంది. దీప కడుపులోకి మరో వారసురాలు రాబోతోంది. ఆమె పుట్టిన వెంటనే గొప్పింటి బిడ్డగానే ఈ అంతఃపురంలో అడుగుపెడుతుంది" అని చెబుతాడు. ఆ మాటలకు జ్యోత్స్న తీవ్రంగా షాక్ అవ్వడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications