Karthika deepam 2 November 26th:కార్తీక్-దీపల జీవితంలో వారసురాలు-గురువుగారి ప్రమాద హెచ్చరిక..!
కార్తీకదీపం 2 సీరియల్‌లో దీప గర్భవతి అనే శుభవార్త ఒకవైపు ఆనందాన్ని నింపగా, మరోవైపు జ్యోత్స్న పాలిట శాపంగా మారింది. గత ఎపిసోడ్‌లో, దాస్ స్వీట్లు పంచుతూ జ్యోత్స్నకు పరోక్షంగా క్లాస్ పీకడం, హోమం పూర్తి చేసి వెళ్తూ రాబోయే విపత్తు తీవ్రత తగ్గించడానికే హోమం చేశామని గురువుగారు శివన్నారాయణను హెచ్చరించడం హైలైట్‌గా నిలిచింది.
దాస్ కీలక వార్నింగ్.. జ్యోత్స్న భయం:
నేటి ఎపిసోడ్‌లో, దాస్ జ్యోత్స్నకు మరోసారి గట్టి వార్నింగ్ ఇస్తాడు. "దీప బిడ్డ గొప్పింటి బిడ్డగా ఈ అంతఃపురంలో అడుగుపెడుతుందని, దీనిని ఎవరూ ఆపలేరని" అంటాడు. రాతను ఎవ్వరూ ఆపలేరని, దీపకు, ఆమె బిడ్డకు అన్యాయం చేయాలని చూస్తే తాను అడ్డుగా వస్తానని హెచ్చరిస్తాడు. "నువ్వు నా కూతురివి అని తెలిసే రోజు దగ్గరలోనే ఉంది" అని దాస్ చెప్పడంతో జ్యోత్స్నకు భయం పట్టుకుంటుంది.

దీప-కార్తీక్ ప్రేమ పయనం:
కార్తీక్ తన భార్య దీపకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తాడు. "ఈ 9 నెలలు నిన్ను భార్యలా కాకుండా చంటి బిడ్డలా చూసుకుంటాను" అని కార్తీక్ దీపకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెబుతాడు. "మన బిడ్డ భూమి మీదకు వచ్చేసరికి ఒక్క సమస్య కూడా ఉండకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు తాత ఇంటికి రావొద్దు, రెస్ట్ తీసుకో" అని చెబుతాడు.
శ్రీధర్ ఆగ్రహం.. కాశీకి వార్నింగ్:
స్వప్న, కాశీలు గొడవ పడుతుండగా, "మీ అన్నయ్య ఆఫ్ట్రాల్ కార్ డ్రైవర్" అని కాశీ మాట్లాడటంతో, ఆ మాటలు విన్న శ్రీధర్ సీరియస్ అవుతాడు. "నా కొడుకును అంటే నేను తట్టుకోలేను. 50 వేల జీతం కోసం తిరిగే నువ్వెక్కడ? ఇచ్చిన మాట కోసం సీఈవో పదవిని వదులుకున్న రాజ్యాన్నే వదిలేసుకున్న రారాజు వాడు. అలాంటి వాడి పేరు మీద మచ్చపడితే ఊరుకోను" అని శ్రీధర్ కాశీకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.
జ్యోత్స్న చెంప చెళ్లుమనిపించిన సుమిత్ర:
దీప మెట్లు ఎక్కడం, పనులు చేయడం లాంటివి చేయొద్దని దశరథ్ చెబుతుండగా, జ్యోత్స్న వెటకారంగా "దీప ఇప్పుడే ప్రెగ్నెంట్ కాలేదు, ఆమెకు ఆల్రెడీ శౌర్య అనే బిడ్డ ఉంది" అని నానా మాటలు అంటుంది. ఆ మాటలు విన్న సుమిత్ర కోపంతో రగిలిపోయి జ్యోత్స్న చెంప చెళ్లుమనిపిస్తుంది. "నువ్వు అవమానిస్తున్నది మాతృత్వాన్ని. నేను నిన్ను ఎలా కన్నానో, శౌర్యను కూడా దీప అలాగే కన్నది" అని సుమిత్ర తీవ్రంగా మందలిస్తుంది. "తల్లి ఎంతమంది బిడ్డల్ని కన్నా, గర్భవతి అయితే ఓనమాలు దిద్దే పసిబిడ్డ అవుతుంది. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు" అని సుమిత్ర జ్యోత్స్నను లోపలికి పంపిస్తుంది.
శివన్నారాయణకు ప్రమాదం భయం:
సుమిత్ర క్షమాపణ చెప్పిన తర్వాత, శివన్నారాయణ కార్తీక్‌ను పక్కకు పిలిచి, గురువుగారు చెప్పిన రాబోయే ప్రమాదం గురించి వివరించి ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఈ ప్రమాదం నుంచి కుటుంబాన్ని ఎవరు కాపాడతారని ఆయన ఆందోళన చెందుతాడు. ఇప్పుడు దీప ఒట్టి మనిషి కాదని, తన కడుపులోని బిడ్డ జాగ్రత్త కూడా తనదేనని శివన్నారాయణ అంటాడు.
ఇంతలో దాస్ మళ్లీ జ్యోత్స్నతో పర్సనల్‌గా మాట్లాడి, "నీ కూతురు బాగుండాలంటే నిజం చెప్పొద్దని బతిమాలుతున్నావు. నేను అన్నింటికీ తెగించాను. దీప కడుపులోని బిడ్డ ఈ అంతఃపురంలో గొప్పింటి బిడ్డగా అడుగుపెడుతుంది" అని తేల్చి చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications