Karthika deepam 2 October 28th Episode:శివన్నారాయణ మాస్టర్ ప్లాన్-500 ఎపిసోడ్‌లో ట్విస్ట్..!!
తన భార్య సుమిత్రను వెతకవద్దని దశరథ్‌తో శివన్నారాయణ కోపంగా మాట్లాడటం, ఈ మార్పు చూసి జ్యోత్స్న, పారిజాతంలో అనుమానం పెరగడం గత ఎపిసోడ్‌లో కనిపించింది. సుమిత్రపై ప్రేమ బయట పెట్టేందుకే అలా చేశానని చెప్పిన శివన్నారాయణ, దశరథ్ పెళ్లి రోజున వారిని కలపడానికి కార్తీక్తో కలిసి ప్లాన్ వేస్తాడు.
నేటి ఎపిసోడ్ హైలైట్స్ (అక్టోబర్ 28):
జ్యోత్స్న, పారుల మధ్య ఆస్తి, కార్తీక్ మీదున్న ప్రేమ గురించి తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దశరథ్-సుమిత్ర కలవాలని పారిజాతం కోరుకోవడం, దాని ద్వారా కార్తీక్ సీఈవో అయితే దీప ఈ ఇంటికి దేవత అవుతుందని జ్యోత్స్న చెప్పడం ఈ సన్నివేశంలో కీలకం. ఆ క్రెడిట్ ఎవరికీ దక్కకుండా సుమిత్రను తనే తీసుకురావాలని జ్యోత్స్న నిర్ణయించుకుంటుంది.

దశరథ్‌ను దారి మళ్లించిన శివన్నారాయణ: శివన్నారాయణ టిఫిన్ చేయకుండా కార్తీక్ కోసం ఎదురుచూడటం ఇంట్లో ఉద్రిక్తత పెంచింది. భార్య బెంగతో దశరథ్ బయటకు వెళ్లబోగా, పారిజాతం కావాలని రెచ్చగొడుతుంది. కానీ శివన్నారాయణ తెలివిగా స్పందించి, సుమిత్ర కోసం వెతకవద్దని మళ్లీ చెబుతూనే, దశరథ్‌ను డ్రైవర్‌తో కలిసి వెళ్లమని బలవంతం చేస్తాడు. ఈ డ్రైవర్ మరెవరో కాదు, వారి ప్లాన్‌లో భాగమైన కార్తీక్. తాత, మనవడు సంతోషంతో సైగలు చేసుకోవడం చూసి పారిజాతం షాక్ అవుతుంది.
కాశీ-శ్రీధర్ డ్రామా, స్వప్న కంగారు: జాబ్ రాలేదనే నిజం దాయడానికి శ్రీధర్‌ను అబద్ధం చెప్పమని వేడుకుంటాడు కాశీ. కాశీ కాళ్లు పట్టుకోవడం స్వప్న చూసి కంగారు పడుతుంది. తన కాపురం బాగుండాలంటే కొన్ని నిజాలు దాయాలని శ్రీధర్ చెప్పడం ద్వారా కాశీని కాపాడుతాడు.
గుడిలో సుమిత్ర-దశరథ్ ఫేస్-టు-ఫేస్: దశరథ్‌ను తీసుకుని కార్తీక్ గుడికి వెళ్లగా, అదే విషయం దీపకు ఫోన్ చేసి చెబుతాడు. సుమిత్రను తీసుకుని గుడికి బయలుదేరాలని దీప అనుకుంటుంది. ఇంతలో జ్యోత్స్న దీప ఇంటికి వచ్చి, సుమిత్రను దీపే కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ పోలీసులను పిలిపించడంతో దీప, కాంచనలు షాక్ అవుతారు.
మరోవైపు, గుడిలో దశరథ్-కార్తీక్‌లను చూసిన సుమిత్ర తీవ్రమైన షాక్‌కు గురవుతుంది. పెళ్లి రోజున భార్యాభర్తలు గుడిలో కలవబోతుండగా, జ్యోత్స్న వేసిన కొత్త ప్లాన్ కథను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications