Karthika deepam 2 October 3 Episode: కార్తీక్ డ్రైవర్‌గా ఎందుకు మారాడు..ఆ రహస్యం ఏంటి..?
కార్తీక దీపం 2 సీరియల్ అక్టోబర్ 2వ తేదీ ప్రసారమైన ఎపిసోడ్‌లో, కార్తీక్‌ను డ్రైవర్ అగ్రిమెంట్ నుంచి విముక్తుడిని చేయడానికి శ్రీధర్ జ్యోత్స్నకు ఏకంగా 30 కోట్ల రూపాయల చెక్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. కార్తీక్ ఆ చెక్‌ను తండ్రి చేతుల్లోనే పెట్టి, అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పారు, జ్యోత్స్న ఊపిరి పీల్చుకోగా, తన కొడుకు అంత చేసినా ఎందుకు ఒప్పుకోవట్లేదో తెలుసుకోవాలని శ్రీధర్ దీపను నిలదీశాడు. మరోవైపు, కంపెనీని నష్టాల నుంచి బయటపడేయడానికి జ్యోత్స్న ప్లాన్‌కు కార్తీక్ మద్దతు తెలిపాడు. జ్యోత్స్న పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టాలని కార్తీక్ సూచించగా, ఇద్దరూ ఒకరిపై ఒకరు మైండ్ గేమ్‌లు ఆడుతున్నారంటూ మాటల యుద్ధం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే, శ్రీధర్ తన కొడుకు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతూ కాశీని ఉద్దేశించి సెటైర్లు వేయడంతో ఇంట్లో మరో వివాదం రాజుకుంది. తన కొడుకు తమకు తిండి పెట్టాలని చెప్పే స్వేచ్ఛ తనకు లేదని, కానీ అతడి కష్టాన్ని గౌరవించాలని శ్రీధర్ అన్నాడు. ఈ చర్చల మధ్య, కార్తీక్ అగ్రిమెంట్ నుంచి బయటకు ఎందుకు రావట్లేదో చెప్పమని శ్రీధర్, కాంచనను నిలదీశాడు. కాంచన కూడా తనకు తెలియదని చెప్పడంతో శ్రీధర్ మరింత షాక్ అయ్యాడు. దాంతో, నిజం తెలుసుకునేందుకు శ్రీధర్ బలవంతంగా కార్తీక్‌ను తీసుకుని వేరే చోటికి వెళ్ళాడు.

నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 3)లో కీలక మలుపు!
అక్టోబర్ 3న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కథ కీలక మలుపు తిరగనుంది. ఏకాంతంగా మాట్లాడిన శ్రీధర్, కార్తీక్‌తో కత్తుల్లాంటి మాటలు ఆడతాడు. "నీ భార్య దీప కారణంగానే నీకు దరిద్రం, పేదరికం, ఈ మధ్యతరగతి జీవితం వచ్చాయి" అని తీవ్రంగా నిందించాడు. ఈ మాటలకు కార్తీక్ స్పందిస్తూ... "దీప లేకపోయుంటే అసలు ఈరోజు నేను మీ ముందు నిలబడేవాడిని కూడా కాదు. నా ప్రాణాలు కాపాడింది దీప!" అని ఉద్వేగంగా వెల్లడిస్తాడు.
దీప రుణం తీర్చుకోవడానికి, ఆ ఇంటికి ఉన్న సంబంధం కారణంగానే తాను ఈ డ్రైవర్ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టానని కార్తీక్ చివరికి తండ్రికి నిజం చెబుతాడు. ఈ ఊహించని నిజం విన్న శ్రీధర్ షాక్‌లో ఉండిపోతాడు.
"దీప రుణం తీర్చుకోవడానికి, ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి?" అని కార్తీక్‌ను గట్టిగా అడగ్గా... "కొంతకాలం ఆగితే అందరికీ అన్ని నిజాలు తెలుస్తాయి" అని కార్తీక్ సమాధానం దాటవేస్తాడు. కార్తీక్ నోరు విప్పక పోవడంతో, "ఇక నుంచి నేనే ఆ రహస్యాన్ని తెలుసుకుంటాను" అని శ్రీధర్ నిర్ణయించుకోవడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. దీప రుణం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆ రహస్యం శివన్నారాయణ ఇంటికి ఎలా ముడిపడి ఉంది? ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ఏం చేయబోతున్నాడు? అనేది తదుపరి ఎపిసోడ్ ఉత్కంఠను పెంచనుంది.












Click it and Unblock the Notifications