Karthika deepam 2 October 7st Episode:జ్యోత్స్న తల్లి సుమిత్ర కాదా?కార్తీక్ తెగించేశాడు..!!
వేలంపాట జరిగేచోట కార్తీక్ ఉండటం వల్ల, జ్యోత్స్నను రెచ్చగొట్టిన వైరా ఆటలు సాగలేదు. 20 కోట్ల నష్టాన్ని తప్పించడానికి, కార్తీక్ తెలివిగా ఫోన్ చేయించడంతో జ్యోత్స్న మధ్యలోనే వేలంపాట నుంచి వచ్చేసింది. 20 కోట్ల నష్టానికి బదులు లాభపడ్డామని తెలియని శివన్నారాయణ కుటుంబం... వేలం పాట ఓడిపోయినందుకు కార్తీక్, దీపలపై మండిపడింది. శివన్నారాయణ ఆగ్రహంతో, అగ్రిమెంట్ తీసుకొచ్చి వారిని ఇంటి నుంచి బయటికి పంపాలని ఆదేశించాడు.
నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 7)లో సంచలన మలుపు
శివన్నారాయణ ఆదేశంతో అగ్రిమెంట్‌ను తీసుకొచ్చిన జ్యోత్స్న, కార్తీక్‌ను మెడ పట్టుకుని గెంటేయాలని కోరింది. ఆ మాట వినగానే పెద్దాయన జ్యోత్స్నపైనే మండిపడ్డాడు. "నువ్వు మనిషివేనా? నీ బుద్ధి అరికాళ్లలోకి జారిపోయింది" అని తిట్టడంతో ఇంట్లో అంతా షాక్ అయ్యారు.

అప్పుడు దశరథ్ అసలు నిజం బయటపెట్టాడు. వైరా అనే తన పాత పార్ట్‌నర్ బిజినెస్‌లో మోసం చేసి, ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చాడని చెప్పాడు. వైరా రెచ్చగొట్టడం వల్లే ఆ ప్రాపర్టీ 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెరిగిందని, జ్యోత్స్న ఇంకో కోటి పాడి ఉంటే కంపెనీకి 11 కోట్లు నష్టం వచ్చేదని వివరించాడు. కార్తీక్ ఫేక్ కాల్ చేయించడం వల్లే ఆ భారీ నష్టం తప్పిందని చెప్పడంతో అందరూ కార్తీక్‌ని మెచ్చుకున్నారు.
అయినా, కార్తీక్‌ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని శివన్నారాయణ ప్రయత్నించగా... "అగ్రిమెంట్ ప్రకారం పెద్ద మేడం గారు (సుమిత్ర) చెబితేనే నేను వెళ్తాను" అని కార్తీక్ షాకిచ్చాడు.
జ్యోత్స్న కన్న కూతురు కాదా?
తర్వాత హాల్లోకి వచ్చిన సుమిత్ర, కార్తీక్‌ను నిలదీయగా.. "మీ కూతురు కారణంగానే నేను ఈ ఇంట్లో ఊడిగం చేస్తున్నాను" అని కార్తీక్ సంచలన నిజం చెప్పాడు. జ్యోత్స్న సుమిత్ర కన్న కూతురు కాదా? అని కార్తీక్ అడగడంతో పారు షాక్ అయ్యింది. "హాస్పిటల్‌లో నేనే పక్కన ఉన్నాను" అని పారు చెప్పగానే... "మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకున్నావా? మన ఇద్దరి మధ్య తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, సెకండాఫ్‌లో ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటుంది" అని కార్తీక్ హెచ్చరించడంతో పారు, జ్యోత్స్నలు వణికిపోతారు.
కార్తీక్ వెనుక ఉన్న అసలు కారణం, జ్యోత్స్న పుట్టుక రహస్యం ఏమిటి? ఈ క్లైమాక్స్ వార్‌కు పారు ఎలా స్పందించబోతోంది? తదుపరి ఎపిసోడ్‌లో మరింత ఉత్కంఠ తప్పదు!












Click it and Unblock the Notifications