Karthika deepam 2 October 9th Episode:దాస్‌ని అడ్డుపెట్టి కార్తీక్ నెక్ట్స్ ప్లాన్-జ్యోత్స్నకు షాక్..!!
కార్తీకదీపం 2 సీరియల్‌లో నిన్నటి 8వ తేదీ ఎపిసోడ్‌లోని హైలైట్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే...అగ్రిమెంట్ రద్దు చేసుకునే అవకాశం వచ్చినా కార్తీక్ ఎందుకు ఇంట్లోనే ఉంటున్నాడనే విషయంపై కాంచన ప్రశ్నించగా, త్వరలో కార్తీక్-దీపాలు రెండు కుటుంబాలను కలుపుతారని అనసూయ ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు, సుమిత్ర కూతురు ఎవరు అంటూ దీప గట్టిగా నిలదీయడంతో కంగారుపడ్డ జ్యోత్స్న, తన పుట్టుక రహస్యం తెలిసిపోయిందని భయపడి నేరుగా తన అసలు తండ్రిని కలుసుకుంది. దాస్‌కు, పారుకు నిజం తెలుసనే విషయంపై కార్తీక్, దీపకు క్లారిటీ ఇచ్చాడు.
నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 9)లో ఉత్కంఠ పరాకాష్ట!
శ్రీధర్ ఇంటికి వెళ్దామని పారు చెప్పగా, కారులో వెళ్తున్న శివన్నారాయణకు ఊహించని షాక్ తగిలింది. దారిలో దాస్ మావయ్య, జ్యోత్స్న గుసగుసలాడుకోవడం చూసిన కార్తీక్ సడెన్‌గా కారు ఆపాడు. దీపే సుమిత్ర కూతురు అన్న విషయం చెప్పొద్దని జ్యోత్స్న, దాస్‌తో ఒట్టు వేయించుకుంటుండగా శివన్నారాయణ చూసి అవాక్కయ్యాడు!

"తల మీద చేయి వేసుకుని ఒట్టు వేయించుకునేంత ముఖ్యమైన విషయం ఏముంది?" అని శివన్నారాయణ నిలదీయగా, కార్తీక్ తెలివిగా సీన్ రీక్రియేట్ చేశాడు. తనపై అనుమానం రాకుండా దాస్ ఏదో చెప్పి తప్పించుకున్నా.. తాత మనసులో మాత్రం అనుమానం మొదలైందని కార్తీక్, దీపతో అన్నాడు. "నీ పుట్టుక గురించి నిజం తెలిస్తే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని దీపకు ధైర్యం చెప్పాడు.
పెళ్లి చేసుకోమన్న పారు.. జ్యోత్స్న ప్లాన్!
బోర్డు మీటింగ్‌లో కంపెనీ నష్టాల గురించి శివన్నారాయణ మాట్లాడబోతున్నాడని తెలుసుకున్న పారు, జ్యోత్స్నలు ఆందోళన చెందారు. కార్తీక్ అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి, అసలు నిజం బయటపడకముందే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే ఆస్తి తమదే అవుతుందని పారు సలహా ఇచ్చింది. "బావే తాళి కడితే కట్టించుకోవడానికి నేను రెడీ" అని జ్యోత్స్న మొండిగా చెప్పింది.
"అసలు వారసురాలు బతికే ఉందని దాస్ చెప్పాడు, ఆమె వస్తే ఎలా?" అని పారు ప్రశ్నించగా.. "నా పోస్ట్ గురించి ఆలోచించుకోవాలి" అని జ్యోత్స్న తెగేసి చెప్పింది. పగిలిన కాఫీ కప్పులాగే తన నమ్మకం కూడా పగిలిపోయిందని దశరథ్ బాధపడటం చూసి సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంది.
దాస్‌ను అడ్డుపెట్టుకుని కార్తీక్ వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా? బోర్డు మీటింగ్‌లో శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? తెలియాలంటే తరువాయి ఎపిసోడ్ చూడాల్సిందే!












Click it and Unblock the Notifications