Karthika deepam 2 September 16 Episode:కార్తీక్ దీపాలపై శివనారాయణ ఫైర్,ఎందుకంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్రతిహంగా సాగిపోతోన్న సీరియల్ కార్తీకదీపం. ప్రతి ఒక్క మహిళ ఈ సీరియల్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌ను ఒకసారి రివైండ్ చేస్తే.. శౌర్య పుట్టినరోజు రహస్యం బయటపడటం చూశాం. శౌర్య గీసిన డ్రాయింగ్ ద్వారా శివ నారాయణకు విషయం తెలిసిపోయింది. పారిజాతం ద్వారా కాంచనకు ఫోన్ చేయించి, ఈరోజు శౌర్య బర్త్‌డే అని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత కార్తీక్, దీపాలను నిలదీశాడు. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 16న ప్రసారమైన 464వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 16)లో..
శౌర్య పుట్టినరోజు విషయం దాచాలని ప్రయత్నించిన కార్తీక్, దీపాలకు శివ నారాయణ షాక్ ఇచ్చాడు. "ఎందుకింత తొందరగా వెళ్తున్నారు?" అని ప్రశ్నిస్తూ, శౌర్య గీసిన డ్రాయింగ్‌ను అందరి ముందు చూపిస్తాడు. "ఈ బొమ్మలో ఉన్నది ఎవరు?" అని అడగ్గా, శౌర్య "నేనే" అని చెబుతుంది. దాని పక్కన ఉన్న బర్త్‌డే కేక్‌ను కూడా చూపిస్తుంది. దీంతో శివ నారాయణ "ఈరోజు నీ పుట్టినరోజు అన్నమాట" అని అందరి ముందు బయటపెడతాడు.

దీంతో దశరథ, సుమిత్ర, శివ నారాయణలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. "మా ఇంట్లోనే ఉంటూ మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు?" అని మండిపడతారు. "మాకు దూరం కావాలని ప్రయత్నిస్తున్నారేమో" అని సుమిత్ర ఆవేదన చెందుతుంది. దీనికి దీప వివరణ ఇస్తుంది. "పాప సాకుతో మీకు దగ్గర కావాలని చూస్తున్నామని కొందరు అవమానిస్తున్నారు. బర్త్‌డే విషయం చెబితే మళ్ళీ అదే అనుకుంటారని భయపడ్డాం" అని అంటుంది. దీప మాటలకు శివ నారాయణ ఇంకా కోపంగా, "మంచిని కూడా దాచేస్తున్నారు, పూర్తిగా దూరమైపోవాలని అనుకుంటున్నారా?" అని నిలదీస్తాడు.
మరోవైపు, కాశీని కాపాడినందుకు కృతజ్ఞతగా శ్రీధర్ కార్తీక్ ఇంటికి వస్తాడు. తాను పూర్తిగా మారిపోయానని, ఒకప్పుడు భర్తగా, తండ్రిగా విఫలమయ్యానని చెబుతాడు. కార్తీక్ మాటల వల్లే తాను మారాడని, ఇకపై మంచిగా ఉంటానని శ్రీధర్ అంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో ఏమి జరగబోతుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications