Karthika deepam 2 September 17 Episode:జ్యోత్స్న రివర్స్ ప్లాన్..కార్తీక్‌కు బిగ్ సర్ప్రైజ్..!!

కార్తీక దీపం 2 సీరియల్ తెలుగింట్లో మకాం వేసేసింది.ఈ సీరియల్ చూడనిదే చాలామంది మహిళలు నిద్రపోరంటే నమ్మగలరా. అంతలా పెనేసుకుపోయింది.ఇక గత ఎపిసోడ్‌లో శౌర్య పుట్టినరోజు విషయం దాచినందుకు శివ నారాయణ, సుమిత్ర, దశరథలు కార్తీక్, దీపాలపై కోపంగా ఉండటాన్ని చూశాం. అయితే, శ్రీధర్ మారిపోయి, కార్తీక్‌తో తన మనసులోని బాధను పంచుకోవడం మరో కీలక ఘట్టం. తాను పూర్తిగా మారిపోయానని, ఇకపై కార్తీక్ చెప్పినట్లు నడుచుకుంటానని శ్రీధర్ హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17న ప్రసారమైన 465వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.

తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 17)లో..
శౌర్య పుట్టినరోజు వేడుకలను కార్తీక్, దీప తమ ఇంట్లో ఘనంగా ఏర్పాటు చేస్తారు. తన తండ్రి శ్రీధర్ మారినందుకు కార్తీక్ ఎంతో సంతోషిస్తాడు. ఇకపై తనను 'మాస్టారు' అని కాకుండా 'నాన్న' అని పిలవాలని శ్రీధర్ కోరగా, కార్తీక్ అందుకు అంగీకరిస్తాడు. శౌర్య పుట్టినరోజు వేడుకలకు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకురావాలని కార్తీక్ శ్రీధర్‌ను కోరతాడు. కావేరి, స్వప్న, కాశీలతో కలిసి శ్రీధర్ కార్తీక్ ఇంటికి వెళ్లడానికి సరేనంటాడు.

karthika-deepam-2-serial-september-17-2025-episode-465-here-is-the-todays-full-story

మరోవైపు, కార్తీక్ ఇంటి నుంచి బయలుదేరగానే జ్యోత్స్న నుంచి ఫోన్ వస్తుంది. శివ నారాయణ అత్యవసరంగా పిలిచారని, ఐదు నిమిషాల్లో ఇంటికి రావాలని జ్యోత్స్న కఠినంగా చెబుతుంది. తన కూతురి పుట్టినరోజు అని చెప్పినా జ్యోత్స్న వినదు. చేసేదేమీ లేక కార్తీక్ బయలుదేరతాడు.

కార్తీక్ శివ నారాయణ ఇంటికి వెళ్ళగానే ఆ కుటుంబం అతనికి ఊహించని షాక్ ఇస్తుంది. అందరూ రెడీ అయి కారులో బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతున్న కార్తీక్‌ను అడ్డుకుని జ్యోత్స్న తానే డ్రైవ్ చేస్తానని చెబుతుంది. ఇది కూడా జ్యోత్స్న ప్లాన్‌లో భాగమేనని కార్తీక్ అనుకుంటాడు. అయితే, జ్యోత్స్న కారును నేరుగా కార్తీక్ ఇంటికే తీసుకువెళ్తుంది. అక్కడ శౌర్య పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చూసి శివ నారాయణ కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. జ్యోత్స్న ప్లాన్ పూర్తిగా రివర్స్ అవ్వడంతో, ఈ నాటకీయ పరిణామాలు నెక్స్ట్ ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+