Karthika deepam 2 September 29 Episode: దీప అపస్మారక స్థితిలోకి..భోజనం పెట్టి షాకిచ్చిన సుమిత్ర!

తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సీరియల్ కార్తీకదీపం 2. ఈ సీరియల్‌తో మహిళలు చాలా బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇక గత ఎపిసోడ్‌లోని ప్రధాన ఘట్టాలను ఒకసారి రివైండ్ చేస్తూ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్‌ గురించి తెలుసుకుందాం. గత ఎపిసోడ్‌లో, దీపను క్షమించేది లేదని సుమిత్ర స్పష్టం చేసినా, ఆమెతో దశరథ్ అన్న మాటల్లో తప్పు లేదని చెబుతుంది. మరోవైపు, ఉద్యోగం లేని కాశీని అత్తారింట్లో చుట్టాలు ఎగతాళి చేయగా, జ్యోత్స్న కాశీకి తమ రెస్టారెంట్‌లో మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానని పారుతో చెప్పి ఆమెను సంతోషపెడుతుంది. కార్తీక్, దీపల సంభాషణను విన్న జ్యోత్స్న, పారులు దీప అమ్మనాన్నల గురించి తెలియకుండానే మాట్లాడుతుందని అనుకుంటూ ఉంటారు.

తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 29)లో..

కార్తీక్, దీపలు వంటగదిలో మాట్లాడుతూ సుమిత్ర, దశరథ్‌ల మొండితనం గురించి చర్చించుకుంటారు. "నాన్న నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టే ఆయన దగ్గరికే వెళ్లాను. ఆయన నాపై కోపంతో కాదు, సరిదిద్దేందుకు మాట్లాడారని నాకు తెలుసు," అని దీప అంటుంది. అయితే, తమ సంభాషణను జ్యోత్స్న, పారులు విన్నారని తెలిసి ఇద్దరూ షాక్ అవుతారు. సుమిత్ర, దశరథ్‌ల గురించి నిజం తెలియనంత వరకు తాము సేఫ్ అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.

Karthika deepam 2 Serial September 29 2029 Episode 474 Here is the Today s full story

మరోవైపు, కాశీని తమ ఇంట్లోనే ఉంచాలని శ్రీధర్ కావేరికి చెబుతాడు. పారు, జ్యోత్స్నలు కాశీకి జాబ్ ఇప్పిస్తామని, డబ్బు సాయం చేస్తామని రాగా, స్వప్న, శ్రీధర్ వారిని వ్యంగ్యంగా తిరస్కరిస్తారు. జ్యోత్స్న తమ రెస్టారెంట్‌లో మేనేజర్ పోస్ట్ ఇస్తానని చెప్పగా, చదువుకున్న తన అల్లుడికి ఆ జాబ్ అక్కర్లేదని కావేరి అంటుంది. ఐటీ కంపెనీ ఓనర్‌తో మాట్లాడి జాబ్ ఇప్పిస్తానని జ్యోత్స్న చెప్పినా కాశీ తిరస్కరిస్తాడు.

Karthika deepam 2 Serial September 29 2029 Episode 474 Here is the Today s full story

ఇంతలో దీప కిచెన్‌లో పనులు చేస్తూ కళ్లు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తుంది. దీన్ని చూసిన సుమిత్ర కంగారు పడి వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేసి చెప్తుంది. దీప రాత్రి నుంచి భోజనం చేయలేదని కార్తీక్ సుమిత్రకు చెప్పడంతో, సుమిత్ర దీప ముఖంపై నీళ్లు కొట్టి లేపుతుంది. కోపంతోనే అయినా, "ఎవరిని సాధిద్దామని నిరాహారదీక్ష చేస్తున్నావు?" అంటూ మందలిస్తుంది. ఆ తర్వాత ప్లేట్‌లో అన్నం పెట్టి "నీకు భోజనం పెట్టేంత మానవత్వం నాలో ఉంది కానీ, తినిపించేంత లేదు" అని సుమిత్ర అంటుంది. దీంతో సుమిత్ర పూర్తిగా మారలేదని, కానీ ఆమెలోని మానవత్వం ఇంకా మిగిలి ఉందని దీప అర్థం చేసుకుంటుంది. తర్వాతి ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+