Karthika deepam 2 September 8th Episode:దశరథ -సుమిత్ర బంధంలో చీలిక..దీపాను ఆదుకున్న కార్తీక్!
కార్తీక దీపం సీరియల్ చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ముఖ్యంగా మహిళలు ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక రోజువారీ ఎపిసోడ్‌లానే కార్తీక దీపం సీరియల్ సెప్టెంబర్ 6వతేదీ 456వ ఎపిసోడ్‌ను ఒకసారి రివైండ్ చేద్దాం. కార్తీక్, దీపాల పెళ్లిలో సుమిత్ర తాళిబొట్టు తీసిన వివాదం ఆ కుటుంబంలో కలహాలు సృష్టిస్తోంది. దశరథ సుమిత్రతో మాట్లాడటం మానేస్తాడు.
ఈ గొడవకు కారణం దీపానే అని భావించిన జ్యోత్స్న ఆమెను ఇంటిలోంచి బయటకు నెట్టేయబోగా, కార్తీక్, శివ నారాయణ వచ్చి అడ్డుకుంటారు. "ఈ ఇంట్లో ఇలాంటి గొడవలు కొనసాగితే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను" అని శివ నారాయణ హెచ్చరించడంతో పరిస్థితి కాస్త శాంతిస్తుంది. దశరథ కార్తీక్, దీపాలను క్షమించమని అడుగుతాడు, కానీ జ్యోత్స్న మాత్రం దశరథ, సుమిత్రలను విడదీసి, దీపాపై పగ తీర్చుకోవాలని సవాలు చేస్తుంది.

సెప్టెంబర్ 8, ఎపిసోడ్ 457:
దీపా ఇంటిలోని అందరికీ రుచికరమైన భోజనం వండి డైనింగ్ టేబుల్‌పై సిద్ధం చేస్తుంది. పారుజాతం "ఏమే పనిమనిషి" అంటూ దీపాను పిలిచి, తన వంటకు తాను పెద్ద ఫ్యాన్‌నని చెబుతుంది. అయితే భోజనం వడ్డించేటప్పుడు దీపా పారుజాతానికి మాత్రం వడ్డించకుండా పక్కకు వెళ్తుంది. ఎందుకని పారుజాతం ప్రశ్నించగా, "మీకోసం కార్తీక్ బాబు వేరే వంటలు తీసుకొస్తున్నారని" దీపా చెబుతుంది. పారుజాతం బిర్యానీ వంటి వంటకాలను ఆశిస్తే, కార్తీక్ ఉడికించిన కూరగాయలను తీసుకువచ్చి తినిపిస్తాడు. ఈ సంఘటన శివ నారాయణ,దశరథ,సుమిత్రల మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది.
శివ నారాయణ భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలో కార్తీక్, దీపాలను చూసి నేర్చుకోమని సుమిత్ర, దశరథలకు పరోక్షంగా సూచిస్తాడు. "మరపు అన్నది దేవుడు ఇచ్చిన గొప్పవరం" అని జ్యోత్స్నకు హితబోధ చేస్తాడు. శివ నారాయణ మాటలు కార్తీక్‌కు మద్దతుగా ఉండటంతో జ్యోత్స్న లోలోపల రగిలిపోతుంది. ఎలాగైనా దశరథ, సుమిత్రలను కలవకుండా చూడాలని కుట్ర పన్నుతుంది. దీపాకు గుణపాఠం చెప్పడానికి తానూ ఒక ప్లాన్ వేస్తానని కార్తీక్ మనసులో అనుకుంటాడు. మరోవైపు, దశరథ, సుమిత్రలు మాట్లాడుకోవడం లేదని తెలుసుకున్న కాంచన బాధపడుతుంది. వారిని త్వరలో కలుపుతానని కార్తీక్ ఆమెకు మాటిస్తాడు.
ఎలా కలుపుతావు అని దీపా కార్తీక్‌బాబును అడుగగా.. ఇవన్నీ సాగదీయకూడదు. ఎలా జరుగుతుందో నువ్వే దగ్గరుండి చూద్దువులే అంటూ కార్తీక్ సమాధానమిస్తాడు.ఆ తర్వాత సీరియల్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో వచ్చే ఎపిసోడ్‌లో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications