రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న కార్తీకదీపం నటి...
కార్తీకదీపం ఫేమ్ మోనిత బిగ్‌బాస్ సీజన్ 7 తో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పడే ఈమె తన ప్రేమ గురించి బయటపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 7లో అందరికంటే ఎక్కువగా నెగిటివిటీతో బయటికి వచ్చేసింది శోభా శెట్టి. తాజాగా, ఈ నటి గురించి సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. శోభాశెట్టి రహస్యసంగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త నెట్టింట తెగ హాల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.
బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి తన కో స్టార్ యశ్వంత్‌లో ప్రేమలో ఉన్నట్లు బిగ్‌బాస్ హోస్‌లో ఉన్నప్పుడే బయటపడింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఓ స్టేజ్ మీద వీరిద్దరూ రింగ్‌లు కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత యశ్వంత్‌తో కలిసి పలు వీడియోలు కూడా చేసింది శోభా. ఇక తాజాగా వీరిద్దరూ రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో శోభా పేరెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది నిజమైనదనే ఆలోచనలో ఉన్నారు నెటిజన్లు.

స్టేజ్‌పైన ఉంగరాలు మార్చుకున్నారు...:
శోభా శెట్టి, యశ్వంత్ మాటీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపంలో సీరియల్‌లో కలిసి నటించారు. ఆ సీరియల్‌లో మోనిత పాత్ర ఎంతో పేరుతెచ్చిపెట్టింది. ఆ సీరియల్ సమయంలోనే ముందుగా తాను యశ్వంత్‌తో ప్రేమలో పడినట్టు శోభా పలు మార్లు బయటపెట్టిన విషయం కూడా తెలిసిందే. తన ప్రేమ, పెళ్లి గురించి ప్రపోజల్స్ అన్ని విషయాలను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్‌తో తన ప్రేమ కథను వివరించింది శోభా. ఇక, ఈ నటి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు యశ్వంత్ కూడా బయట చాలా సపోర్ట్ చేశాడు. శోభాకు ఓట్లు వేయమని ఆడియన్స్‌ను కూడా అడిగాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత శోభా శెట్టి పాల్గొన్న ఓ ఈవెంట్‌లో యశ్వంత్ కూడా కనిపించాడు. అంతే కాకుండా ఆ స్టేజ్‌పైనే వారిద్దరూ రింగ్స్ కూడా మార్చుకున్నారు. అలా స్టేజ్‌పైన వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక తాజాగా మరోసారి వీరిద్దరికి ఇంట్లోనే రహస్యంగా నిశ్చితార్థం ఉన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను స్టార్ మా సీరియల్స్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శోభా శెట్టి, యశ్వంత్‌ల తల్లిదండ్రులు కూడా కనిపిస్తుండడంతో నిజంగానే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయ్యిందని చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై అటు శోభా కానీ, యశ్వంత్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్‌మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్‌మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications