ఈసారి 'మార్కో'ని మించి..!
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై 'మార్కో' తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ 'కట్టలన్' లాంచ్ అయ్యింది. రూ.45 కోట్ల భారీ బడ్జెట్‌తో మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం కొచ్చిలో అద్భుతంగా జరిగింది. బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లగ్జరీ కార్లు, బైక్‌లతో ఈవెంట్ మరింత గ్రాండ్‌గా కనిపించింది.
డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, 'కాంతార', 'మహారాజా' సినిమాలతో సంచలనం సృష్టించిన కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'జైలర్', 'లియో' వంటి హిట్ చిత్రాలకు పనిచేసిన ఐడెంట్ లాబ్స్ టైటిల్ డిజైన్ చేశారు. హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటించనున్నారు.

ఈ చిత్రంలో తెలుగు నటుడు సునీల్, 'మార్కో' ఫేమ్ కబీర్ దూహన్ సింగ్, అలాగే సీనియర్ నటులు జగదీష్, సిద్దిక్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'పొన్నియన్ సెల్వన్', 'బాహుబలి 2', 'జవాన్' వంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ చిత్రానికి స్టంట్స్ కంపోజ్ చేస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఈ సినిమా త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది.












Click it and Unblock the Notifications