పెళ్లికి ముందు ఈ విధ్వంసం ఏంటీ కీర్తి

ఇటీవల బాగా వినిపిస్తోన్న హీరోయిన్ల లిస్ట్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తోంది. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది.

Keerthy Suresh Exclusive Photo Shoots goes viral

ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. డిసెంబర్ 20న హిందీలో కీర్తి సురేష్ డెబ్యూ మూవీ 'బేబీ జాన్' రిలీజ్‌కి రెడీ అవుతోంది. తాజాగా 'బేబీ జాన్'' సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో కీర్తి సురేష్ గతానికి భిన్నంగా కనిపించింది. క్లీవేజ్‌ షో, నాభి అందాలు, థైస్ షోతో కనిపించి అభిమానులకు షాకిచ్చింది.

ఇక మీదట స్కిన్ షోకి రెడీ అంటూ కీర్తి సిగ్నల్ ఇస్తోంది. కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టినట్టు అనిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన తర్వాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. తాజాగా మరోసారి హాట్ ఫొటో షూట్‌తో రెచ్చిపోయింది.' Face' మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌లో తనదైన అందంతో రెచ్చిపోయింది. క్లీవేజ్ షోతో అభిమానులకు మంచి కిక్కు ఇచ్చింది. ఇక ఈ ఏడాదే కీర్తి పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనితో కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+