స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో కీర్తి సురేష్
మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు. కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తమిళ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, నేను శైలాజా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్, వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.
ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన అనేక పుకార్లు వచ్చాయి. కీర్తి సురేష్ , ఓ కమెడియన్‌ను వివాహం చేసుకున్నారని, ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని, కీర్తి చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇలా అనేక కథనాలు వెలిశాయి.

అయితే తన పెళ్లిపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన ప్రియుడును పరిచియం చేశారు. హీరో నాని కుమారుడు జున్ను అంటే తనకి చాలా ఇష్ణమని చెప్పుకొచ్చింది. నన్ను అతని గర్ల్ ఫ్రెండ్ అని అందరికి చెబుతాడని ఆమె చెప్పుకొచ్చింది. నా బర్త్ డే రోజు జున్ను నాకు విషెష్ చెప్పిన తీరు ఇప్పటికి నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. హ్యాపీ బర్త్ డే కిట్టీ అని వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాడని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ - నాని కుమారుడి క్యూట్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications