మొత్తానికి అతనితో పెళ్లి అనౌన్స్ చేసిన కీర్తి సురేష్
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె తన సినిమాలతో కన్నా, వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి.అయితే గతానికి భిన్నంగా ఈసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా పెళ్లిపై కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు. తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనితో కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.తన ప్రియుడును ఆంటోనిని సోషల్ మీడియా ద్వారా పరిచియం చేసింది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది.

తన ప్రేమికుడు ఆంటోనితో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది. గత వారం రోజుల నుంచే కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. గోవాలో డిసెంబర్ 12న మ్యారేజ్ అని కూడా చెప్పారు. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం. ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.
ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications