అతనితో పెళ్లికి సిద్ధమైన కీర్తి సురేష్..?
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకరు. ఆమె తన సినిమాలతో కన్నా, వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే పేరును సాధించుకుంది. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.

ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్‌కు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై కీర్తి సురేష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన అవి నిజమనే నమ్ముతారు. అందుకే అలాంటి రూమర్స్‌పై నేను స్పందించనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టాంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కీర్తి సురేష్ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications