అతను ఇంటికొచ్చి మరీ పెళ్లి చేసుకుంటానని అడిగాడు: కీర్తి సురేష్

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.కీర్తి సురేష్ , ఓ కమెడియన్‌ను వివాహం చేసుకున్నారని, ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని, కీర్తి చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ ఇలా కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇలా అనేక కథనాలు వెలిశాయి.పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ..ప్రస్తుతం తన దృష్టాంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటానని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.దీంతో కీర్తి సురేష్ పెళ్లిపై వచ్చినవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయాయి.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా తనకొచ్చిన ఓ లవ్ ప్రపోజ్ గురించి చెప్పుకొచ్చింది. నన్ను అభిమానించే ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతన్ని చూసి ముందు భయపడ్డా కానీ, తర్వాత అతను నాపై చూపించే అభిమానం ప్రేమ నచ్చాయి. సినీ తారలుగా తాము పడుతున్న కష్టానికి ఇలా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమ వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడినా పర్వాలేదని అనిపిస్తుందంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

Keerthy Suresh reacted when a fan asked her to marry him

ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు లేటెస్ట్‌గా 'దసరా' సినిమాలో వెన్నెల పాత్రకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని హీరోగా నటించిన ఈ మూవీలో కీర్తి.. వెన్నెల పాత్రలో ఆమె చేసిన నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. బెస్ట్ హీరోగా నాని, బెస్ట్ దర్శకుడుగా శ్రీకాంత్ ఓదెలకు సైతం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ దక్కాయి. 'దసరా' సినిమా మొత్తం ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది. ఇక కీర్తి సురేష్‌ కెరీర్ విషయానికి వస్తే..

ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. 'రఘు తాత' అనే తమిళ మూవీలో నటిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+