ఆ ఒక్క సినిమా చేయనని చెప్పి చిరంజీవిని మెగాస్టార్ చేసిన మరో స్టార్ హీరో

విలన్ పాత్రలు, సహాయక పాత్రలు చేస్తూ నెమ్మదిగా హీరో అయిన చిరంజీవి.. తర్వాత సుప్రీంహీరో చిరంజీవిగా మారారు. పేరుకు ముందు సుప్రీంహీరో అనే బిరుదు చాలాకాలం ఉంది. ఆ తర్వాత అది పోయి మెగాస్టార్ అని వచ్చి చేరింది. ఇప్పటివరకు అదే కొనసాగుతూ వస్తోంది. హీరోగా నెమ్మదిగా అడుగులు వేస్తున్న సమయంలో ఏ.కోదండరామిరెడ్డి మంచి కథను తీసుకొని సూపర్ స్టార్ కృష్ణ దగ్గరకు వెళ్లారు. ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆయన్ను కృష్ణ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో సంవత్సరానికి 10 నుంచి 12 సినిమాలు, రోజుకు మూడు షిఫ్టుల చొప్పున చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. కోదండరామిరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. కానీ చేయడానికి కాల్షీట్లు ఖాళీలేవు.

కథలో ఉన్న లోతును అర్థం చేసుకున్న చిరంజీవి

ఆ సినిమా ఏదో కాదు.. ఖైదీ. 1983లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'ఫస్ట్ బ్లడ్' స్ఫూర్తితో రూపొందించారు. అందుకే చాలామంది హీరోలు వెనకాడటంతో కృష్ణ దగ్గరకు వచ్చింది. ఆయనకు ఖాళీ లేకపోవడంతో చివరకు చిరంజీవి దగ్గరకు చేరింది. మనకు రాసిపెట్టివుంటే అది ఎక్కడున్నా భగవంతుడు మనదగ్గరకు పంపిస్తాడనేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ, సజీవ సాక్ష్యం. ఈ కథలో ఉన్న భావోద్వేగాలను, ఇతర అంశాలను చక్కగా అర్థం చేసుకున్న చిరంజీవి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సంయుక్త మూవీస్ బ్యానరుపై తిరుపతిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అందుకే సంయుక్త అనే పేరును బ్యానరు పేరుగా పెట్టారు.

khaidi This Movie Initially Reached to Superstar Krishna but he rejected it went to chiranjeevi and made huge success

హాలీవుడ్ స్థాయిలో చూపించారు

మాధవి, సుమలత, రావుగోపాలరావు కీలక పాత్రలు పోషించారు. చక్రవర్తి సంగీతం అందించారు. 1983 కాలంలో హాలీవుడ్ రేంజ్ లో ఓ మాస్ సినిమాను, హీరోను చాలా అగ్రెసివ్ గా చూపిస్తూ సినిమా తీయడంతో అందరూ థియేటర్లకు పోటెత్తారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ సినిమాతోనే చిరంజీవి మాస్ ఇమేజ్ ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరుకుంది. చిరంజీవి దశ, దిశను ఖైదీ సినిమా పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో 'రగులుతోంది మొగలిపొద' పాటకు చిరంజీవి, మాధవి చేసిన నృత్యాలు ఒక సంచలనాన్ని సృష్టించాయి. ఆ రకంగా సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమాను చేయకుండా చిరంజీవిని మెగాస్టార్ గా నిలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+