Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. ప్రెగ్నెన్సీ ఫొటోలు వైరల్

బాలీవుడ్ నటి కియారా అద్వానీ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో జర్నీ ప్రారంభించింది. ఇక కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ భామ. దీంతో కియారాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో మెరిచింది ఈ బ్యూటీ.

రీసెంట్‌ గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో పెద్ద హిట్ కొట్టింది కియారా. ఆ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

Kiara Advani s Baby Bump Photos Go Viral Online

అయితే తాజాగా కియారా అద్వానీ బేబీ బంప్ తో కనిపించింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జంటపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెప్పిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి కియారా ఏదో షాపింగ్ మాల్ కు వెళ్లి వస్తుండగా కెమెరాకు చిక్కింది. అక్కడ ఈ ముద్దుగుమ్మ బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వావ్ బేబీ బంప్ నైస్ అంటూ నెట్టింట కామెంట్స్ వర్షం కురుస్తోంది.

2021లో విడుదలైన 'షేర్షా' సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి కియారా నటించింది. అక్కడే పరిచయం ఏర్పడింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో కుటుంబసభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7న కియారా- సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. రాజస్థాన్​ జైసల్మేర్ లోని సూర్య గఢ్ హోటల్‌ లో ఈ స్టార్ కపుల్ పెళ్లి ఘనంగా జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+