శ్రీకృష్ణదేవరాయలుగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మనందరికీ సుపరిచితమే.. తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఈగ' మూవీలో విలన్ గా తన నటనతో అందరినీ ఆశ్చర్య పరిచారు కిచ్చా సుదీప్ అలాగే రాజమౌళి 'బాహుబలి' సినిమాలోనూ ఓ రాజు పాత్ర చేసి మెప్పించారు. ఇక కన్నడలో అయితే స్పర్శ, హుచ్చా, నంది, కిచ్చా, స్వాతి ముత్తు, మై ఆటోగ్రాఫ్, వీరమడకరి, కెంపెగౌడ, విక్రాంత్ రోణ తదితర చిత్రాలతో స్టార్ హీరోగా మారారు. ఇటీవల కేడీ ది డెవిల్ సినిమాతో అలరించారు. అలాగే 2027 లో బిల్లా రంగా బాషా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'దేవరాయ' మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కిచ్చా సుదీప్ హీరోగా దేవరాయ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

ఈ మూవీలో కిచ్చా సుదీప్ శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హనుమాన్ ఫేమ్ గౌర హరి కే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే పీఎంఎఫ్ వీఎఫ్‌ ఎక్స్ వర్క్ చేయనుంది. ఇప్పటి వరకు కిచ్చా సుదీప్ అంటే మాస్, యాక్షన్ పాత్రలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్‌ లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

KicchaSudeep as Sri Krishnadevaraya the first look from the movie Devaraya guarantees goosebumps

ఇక దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఆయన ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు ప్రాంత వాసులకు సుపరిచితమే. ఇక దేవ రాయలవారి పాలనలో విజయనగర వీధుల్లో ముత్యాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే దేవరాయల సంస్థానం భువన విజయంలో కవులకు, సాహిత్యకారులకు అధిక ప్రాధాన్యం ఉండేది. అందుకే శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగంగా పిలుస్తుంటారు. మరి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణ దేవరాయలుగా కిచ్చా సుదీప్ ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+