Kiran Abbavaram ఈసారి పెద్ద స్కెచే వేశాడుగా..!
సాధారణంగా ఒక హీరో సక్సెస్ ట్రాక్‌లోకి రాగానే అదే జోనర్‌లో సినిమాలు చేస్తుంటారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం రూటు మార్చారు. 'క' సినిమాతో తనలోని కొత్త నటుడిని పరిచయం చేసిన ఆయన, ఇప్పుడు ఏకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థల అండతో ఒక మెగా మిథాలజీ యాక్షన్ డ్రామాకు ఆయన శ్రీకారం చుట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా కేవలం కిరణ్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. దీని వెనుక ఉన్న పేర్లు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు సౌత్‌లోనూ ఎంతో ప్రాముఖ్యత కలిగినవి.'రుస్తుం', 'ప్యాడ్‌మ్యాన్' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాలు అందించిన అనుభవం వీరిది.జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడంలో వీరు దిట్ట.ఈ ఇద్దరు నిర్మాతలు కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన క్రేజ్‌కు సరిపోయే ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు.

ప్రస్తుతం ఇండియన్ ఆడియన్స్ మిథాలజీ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, మన సంస్కృతిని నేటి తరం టెక్నాలజీతో జోడించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ గ్రాండియర్. మునుపెన్నడూ చూడని రీతిలో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కిరణ్ సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేదా టాలీవుడ్ టాప్ బ్యూటీలలో ఒకరిని ఎంపిక చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ వివరాలతో పాటు, ఈ భారీ చిత్రాన్ని నడిపించే దర్శకుడు ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన కుర్రాడు, తన కష్టంతో నేడు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలను మెప్పించడం కిరణ్ అబ్బవరం సక్సెస్ గ్రాఫ్‌కు నిదర్శనం. ఈ చిత్రం కనుక సక్సెస్ అయితే, టాలీవుడ్ నుంచి మరో పాన్-ఇండియా స్టార్ ఉద్భవించినట్టే.












Click it and Unblock the Notifications