విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న కోలీవుడ్ స్టార్ క‌పుల్‌..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఇటీవ‌లే తెలుగులో సార్ చిత్రంతో తెలుగు అభిమానుల‌ను మెప్పించారు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా వ‌రించాయి. ధ‌నుష్ ర‌జ‌నీకాంత్ అల్లుడిగా కాకుండా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలే ధ‌నుష్‌, ఐశ్యర్య విడాకుల విషయం తెర‌పైకి వ‌చ్చింది. వీళ్లిద్ద‌రూ విడాకులు తీసుకుంటున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే, ఈ విడాకుల విష‌యంపై వ్యక్తిగతంగా వీరిద్ద‌రూ కోర్టుకు హాజరుకావాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ఈ స్టార్‌క‌పుల్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్యర్య, ధనుష్ 2004లో ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు. వీరి పేర్లు యాత్ర, లింగ. వీరిద్ద‌రూ గ‌త 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. అయితే, ఈ స్టార్ క‌పుల్ ప‌లు వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల 2022లో విడిపోతున్న‌ట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త విన్న ధ‌నుష్ అభిమానులు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. అయితే, వీరిద్ద‌రిని క‌లిపేందుకు సూప‌ర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ప్రయత్నించినప్పటికీ వీరి విడాకుల‌ను మాత్రం ఆప‌లేక‌పోయారు. అయితే, ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య కొన్ని రోజుల క్రితం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. వీరిద్ద‌రూ పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం దరఖాస్తు చేసిన‌ట్లు తెలిపారు. ఇక‌, వీరి పిటిషన్ ను నిన్న జడ్జి సుభాదేవి విచార‌ణ జ‌రిపి, అక్టోబర్ 7వ తేదిన వీరిద్ద‌రూ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Kollywood star couple filed for divorce

రెండేళ్ల నుంచి వేరుగా ఉంటున్న ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌...

అయితే, 2022లోనే విడిపోతున్న‌ట్లు ప్ర‌కటించిన ఈ జంట రెండేళ్ల నుంచి వేర్వేరుగానే నివసిస్తున్నారు. ఇక‌, వీరి కుమారులిద్దరూ ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వర్య ద‌గ్గ‌రే ఉంటున్నారు. ఈ పిల్ల‌లిద్ద‌రూ అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తుంటారు. ఈ స్టార్ క‌పుల్ వారి ఇర‌వై ఏళ్ల వైవాహిక జీవితానికి త్వ‌ర‌లోనే ముగింపు పలకబోతున్నారు. ఇక‌, ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య చాలా సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ న‌టుడు ధ‌నుష్ కూడా ఒక్క కోలివుడ్‌లోనే కాకుండా తెలుగు, హిందీ భాష‌ల‌లో కూడా సినిమాలు చేస్తూ మంచి హిట్స్‌ను అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+