పెద్ద తప్పు చేసిన కొరటాల శివ ..సందిగ్ధంలో 'దేవర'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొరటాల శివ చేసిన కామెంట్స్‌ ఆ సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందనే చర్చ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కొరటాల మెగాస్టార్ చిరంజీవిపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..ఎవరు చేసే పనిని వారు ప్రశాంతంగా చేసుకోనివ్వాలని, అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు.

అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టడం, మన పనిని మనం చేయనివ్వకుండా అడ్డుపడటం, తామే బాధ్యత తీసుకోవడం లాంటివన్నీ కష్టమన్నారు. అయితే కొరటాల ఈ వ్యాఖ్యలు చిరంజీవి ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొరటాలపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. తీసింది ఐదు సినిమాలు అందులో రెండు హిట్లు, రెండు యావరేజ్ సినిమాలు. ఈ మాత్రం దానికే చిరంజీవిపై కామెంట్స్ చేసేంత ధైర్యం చేస్తావా అంటూ మెగా అభిమానులు కొరటాల తీరుపై మండిపడుతున్నారు. దీంతో 'దేవర' సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. 'దేవర' సినిమాను ఆచార్య సినిమాతో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Koratala Siva made a mistake by commenting on Chiranjeevi

'దేవర' సినిమాను ఆచార్యతో మూడిపెడుతూ..ఇది ఆ సినిమాను మించి పోతుందని మరికొందరు మెగా అభిమానులు ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సింగిల్‌గా వస్తోన్న సినిమా కావడంతో ఆయన అభిమానులు 'దేవర'పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ కొరటాల చేసిన కామెంట్స్‌తో సినిమాపై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడినట్టు అయింది. చిరంజీవిపై కామెంట్స్ చేసి కొరటాల తప్పు చేశారనే అభిప్రాయం ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కానీ 'దేవర' బయటపడేలా కనిపించడం లేదు. సెప్టెంబర్‌ 27న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతున్నారు. 'దేవర'కు అనిరుధ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ''ఎందుకు పుట్టిందో'' సాంగ్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+