కోట శ్రీనివాసరావు ముఖంపై ఉమ్మేసిన బాలకృష్ణ
నాటక రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, విలనిజంలోనే కామెడీని పండించడంతోపాటు క్రూరమైన హావభావాలను అలవోకగా పలికించిన కోట శ్రీనివాసరావు గురించి దేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో తెలియనివారు లేరు. అద్భుతమైన నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన లేకుండా ఏ స్టార్ హీరో సినిమా వచ్చేది కాదు. అహనా పెళ్లంట సినిమాలో పిసినారి పాత్రలో ఆయన నటన నభూతో నభవిష్యతి అని చెప్పొచ్చు. కోడిని పైన వేలాడదీసి దాన్నిచూస్తూ ఏ కూర కలుపుకోకుండా ఒట్టి అన్నం తింటూ కోడి బిర్యాన్నీ తింటున్నానని చెప్పడం లాంటి సన్నివేశం తెలుగులో ఇంతవరకు రాలేదంటే ఆ స్థాయిలో మరో సన్నివేశాన్ని ఏ దర్శకుడూ చిత్రీకరించలేకపోయాడు.
తప్పుకోండి అంటూ సైగలు చేశారు
అటువంటి కోట శ్రీనివాసరావును ఓ స్టార్ హీరో దారుణంగా అవమానించాడు. ఏకంగా ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్ము వేశాడు. అంతటి దారుణమైన పనిచేసిన హీరో ఎవరనే విషయాన్ని కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఆ హీరో ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ. ఓ సినిమా షూటింగ్ కోసం కోట శ్రీనివాసరావు రాజమండ్రి వెళ్లగా, అక్కడ షూటింగ్ కోసం బాలకృష్ణ కూడా వచ్చారు. రాజమండ్రిలో హోటల్ దగ్గర కోట లిఫ్ట్ దగ్గర ఎదురుచూస్తుండగా కొందరు దూరం నుంచి తప్పుకోండి.. తప్పుకోండి అంటూ సైగలు చేశారు.

మర్యాదపూర్వకంగా విష్ చేసిన కోట
వాళ్లు ఎందుకు అలా చెబుతున్నారో కోటకు అర్థం కాలేదు. తీరా చూస్తే బాలయ్య వస్తుండటంతో మర్యాదపూర్వకంగా కోట శ్రీనివాసరావు నమస్కారం బాబు గారు అని విష్ చేశారు. వెంటనే బాలయ్య కోట ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేశారు. దీంతో తనకు ఏమీ అర్థం కాలేదని, ఆయన ఎందుకు అలా చేశారో తెలియక షాక్ లో ఉండిపోయానని కోట ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందనేది తనకు అర్థం కాలేదన్నారు. బాలయ్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ అర్థం కాదు. ప్రేమగా దగ్గరకు వచ్చిన అభిమానులపై ఎన్నోసార్లు చేయిచేసుకున్నాడు. సెట్స్ లో అసిస్టెంట్లపై కూడా చేయిచేసుకుంటుంటారు. ఇటీవలే ఓ వేడుకలో హీరోయిన్ అంజలిని వెనక్కి నెట్టారు. అది దేశవ్యాప్తంగా వైరలైంది. కోట శ్రీనివాసరావులాంటి లెజండరీ నటుడిపై బాలయ్య అలా చేయడాన్ని ఆయన అభిమానులు కూడా అంగీకరించడంలేదు.












Click it and Unblock the Notifications