కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఆ పని చేసిన కోటా శ్రీనివాసరావు ..!

తెలుగు చిత్రసీమ మరో దిగ్గజ నటుడుని కోల్పోయింది. విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు (83) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున , హైదరాబాద్‌లో నివాసంలోనే పరమపదించారు. ఈ వార్తతో సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో మెగా స్టార్ చిరంజీవితో కలిసి సినీ రంగంలో అడుగుపెట్టిన కోట, నాటి నుండి ప్రతిభ, శైలితో పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. హాస్యం, విలనిజం, కారక్టర్ ఆర్టిస్టుగా నటనతో మెప్పించిన ఆయన దాదాపు 750కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు తో పాటు తమిళం, మలయాళం వంటి ఇతర భాషల సినిమాల్లోనూ కనిపించారు.

kota-srinivasarao-sing-a-song-in-pawan-kalyan-gabbar-singh-movie

గాయకుడిగానూ..

కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా కూడా సత్తా చాటారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో 'మందు బాబులం..' పాటను కూడా ఆలపించారు, ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అయితే అంతకు ముందు 1995లో కూడా విడుదలైన సిసింద్రీ సినిమాలో 'హలో బాసు..' అనే పాటలో మనో, మురళీధర్ లతో కలిసి పాడారు.

ఇక పలు తమిళ్ డబ్బింగ్ సినిమాలకు తన గొంతు అందించారు. ముఖ్యంగా గౌండమని, మణివన్నన్ వంటి ప్రముఖ నటుల పాత్రలకు జెంటిల్‌మ్యాన్, భారతీయుడు, నరసింహ, ఒకే ఒక్కడు, శివాజీ వంటి చిత్రాల్లో తెలుగు డబ్బింగ్ చేశారు.

కోట శ్రీనివాసరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన నటన, పౌరాణికత, వ్యక్తిత్వం ఎప్పటికీ మర్చిపోలేమని అంటున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన సంతాప సందేశంలో, "ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా సినిమాల్లో నటించడం నాకు మధుర జ్ఞాపకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+