సౌందర్య కొడుకు ఎంత పెద్దవాడయ్యాడో..? ఫోటోలు వైరల్.. ఆ సినిమాతోనే హీరోగా ఎంట్రీ..!
అలనాటి అందార తార సౌందర్య గురించి అందరికీ తెలిసిందే. ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. దాదాపు అందరు టాలీవుడ్ టాప్ హీరోస్ తో ఆమె జత కట్టింది. విక్టరీ వెంకటేశ్, సౌందర్య ల కాంబోలో అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవితోనూ చూడాలని ఉంది లాంటి క్లాసికల్ హిట్ మూవీలో నటించి మెప్పించింది.
ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సౌందర్య.. దురదృష్టవశాత్తూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె నటించిన హిట్ చిత్రాల్లో అంతఃపురం ఒకటి. ఈ మూవీలో బాలనటుడిగా నటించాడు కృష్ణ ప్రదీప్. సౌందర్య కుమారుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సౌందర్య తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా టాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీలోనూ రీమేక్ అయింది.

ఇక ఈ మూవీలో సౌందర్య కుమారుడిగా నటించిన కృష్ణ ప్రదీప్ ఈ సినిమా తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు. అయితే ప్రస్తుతం ది ఇండియా హౌస్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇతను సౌందర్య సొంత కొడుకు కానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications