మెగా హీరోతో లిప్‌లాక్ చెయ్యడం ఇష్టం లేకనే ఆ సినిమాని వదులుకున్నా - హీరోయిన్
ఏ ఇండస్ట్రీలో అయినా అదృష్టం అనేది ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సినీ ఇండస్ట్రీలో అయితే ఈ అదృష్టం కాసింత ఎక్కువే ఉండాలి. టాలెంట్ ఉండి అదృష్టం కలిసి రాక ఆరంభ దశలోనే ఆగిపోయిన హీరో , హీరోయిన్లు లిస్ట్ చాలానే ఉంది. ఒక్కోసారి అదృష్ణ దేవత తలుపు తట్టిన కూడా.. మనకు తెలియదు.
సరిగ్గా ఇప్పుడు ఇదే విషయంలో బాధపడుతున్నారు హీరోయిన్ శివాని రాజశేఖర్.కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా వదులుకున్నానని ఇప్పుడు తెగ బాధపడుతున్నారామె. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనలో హీరోయిన్‌గా తొలుత శివాని రాజశేఖర్‌నే చిత్ర యూనిట్ సంప్రదించారట.

కాని ఆ సినిమాలో చాలా బోల్డ్‌గా కనిపించాలని, లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు చెప్పడంతో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేనని.. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతానని చెప్పి శివాని రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకుందట. అలా ఉప్పెన సినిమా నా చెయ్యి నుంచి జారిపోయిందని చెప్పి తెగ బాధపడిపోతుంది. ఆ తరువాత ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

బేబేమ్మగా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సూపర్ డూపర్ హిట్ కావడంతో..కృతి శెట్టికి తెలుగులో వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. రామ్, నాగ చైతన్య, నితిన్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో కృతి శెట్టి జోడి కట్టింది. ఉప్పెన సినిమాను రిజెక్ట్ చేసి శివాని రాజశేఖర్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యింది కదా అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications