అతనితో రెడ్ హ్యాండెట్‌గా దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్
బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది.
దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగులో ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర తెచ్చుకున్న కృతి సనన్, బాలీవుడ్‌లో మాత్రం బాలీవుడ్ మాత్రం సత్తా చాటారు. బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి అభిమానులను అలరించింది.ఒకనొక సమయంలో ప్రభాస్‌తో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం కూడా జరిగింది.

అయితే అమ్మడు లండన్‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి సనన్ డేటింగ్ చేస్తోంది.మనోడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది.వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అందరికి అర్థం అయింది. త్వరలోనే కృతి సనన్ కబీర్ బహియాను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. ఇటీవల ప్రియుడు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఆ సమయంలో కృతి సనన్ దమ్ము కొడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అమ్మడు సిగరెట్ తాగుతున్న ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా మరోసారి కృతి సనన్ తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచింది. కృతి సనన్ శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్ బయట కనిపించింది. ఆమె వెంట ప్రియుడు కూడా ఉన్నాడు.
కృతి సనన్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ, పక్కనే ఉన్న అమ్మాయి సహాయం తీసుకుంది. చూస్తుంటే ఆమె డ్రింక్ ఎక్కువగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కృతి వీడియో చూసిన నెటిజన్లు ఆమె డ్రింక్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. భారత స్త్రీ అయి ఇలాంటి పనులు చేస్తావా అంటూ కొందరు ఆమెపై ఫైర్ అవుతుంటే.. మరికొందరు అది ఆమె పర్శనల్ విషయమని కృతి సనన్‌కు సపోర్టు చేస్తున్నారు. ప్రస్తుతం కృతి సనన్ దమ్ము కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications