కుమారి ఆంటీ సంచలనం.. ఇద్దరు స్టార్ హీరోలకు నో?

కుమారి ఆంటీ... ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఆమె చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతూ సెలబ్రిటీ అయిపోయారు. ఆమె స్టాల్ లోని వంటకాలు బాగా రుచిగా ఉండటంతో ఎక్కడెక్కడి నుంచో భోజనం చేయడానికి అందరూ అక్కడికే వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. తర్వాత జరిగిన పరిణామాలు ఆమెను సెలబ్రిటీని చేశాయి.

మీది మొత్తం వెయ్యి రూపాలయు అయింది.. రెండు లివర్ ఎక్స్ ట్రా అనే డైలాగుతో సంచలనం సృష్టించింది. ఈ ఒక్క వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్లింది. తానుకూడా ఆ స్టాల్ ను సందర్శిస్తానని రేవంత్ చెప్పారు. మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతోపాటు పలు టీవీ కార్యక్రమాలకు కుమారి ఆంటీ హాజరవుతోంది. కార్తీక దీపం సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కుమారి వెళ్లారు. అక్కడ ఓ వార్తాఛానెల్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది.

kumari aunty rejected chiranjeevi and balakrishna movies

కొందరు ఛానెల్స్ వారు వచ్చి తనను అడిగారని, తన పిల్లలు చెప్పడంతోనే కొన్ని సీరియల్స్ లో నటించానన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నానని, ఇంద్రజ, ఆది లాంటివారితో నటించానన్నారు. నటించేటప్పుడు కాస్తంత ఇబ్బంది పడ్డానని చెప్పారు. సీరియల్స్ లో నటించినందుకు ఏమైనా పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే తీసుకోలేదని చెప్పింది. కాకపోతే అక్కడకు తాను తీసుకువెళ్లిన భోజానానికి మాత్రం డబ్బులిచ్చారని తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రాలేదా అని ప్రశ్నిస్తే వచ్చాయికానీ వ్యాపారం ఉండటంతో కుదరదని చెప్పానన్నారు. తనకు ఫుడ్ పెట్టే ఫుడ్ వ్యాపారాన్ని వదులుకొని సినిమాల్లో నటించనన్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయని, వాటినే తిరస్కరించిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గొప్ప నిర్ణయం తీసుకుందని, స్టార్ హీరోల సినిమాలను కూడా తిరస్కరించడం గ్రేట్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+