'L2 ఎంపురాన్' రివ్యూ..ప్రభాస్ ఫ్రెండ్ దర్శకత్వం ఎలా ఉందంటే..!
'L2 ఎంపురాన్' చిత్రం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రం 'లూసిఫర్'కు సీక్వెల్‌గా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా. లూసిఫర్ సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. లూసిఫర్ సూపర్ హిట్ కావడంతో , ఈ సినిమాకు సీక్వెల్‌గా 'L2 ఎంపురాన్' సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య 'L2 ఎంపురాన్' గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ:
కేరళ సీఎం జతిన్ రామ్‌దాస్ (టోవినో థామస్) అధికార పార్టీ నుంచి తప్పుకుని సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుంటాడు. అతడికి తోడుగా బాబా బజ్‌రంగ్ అలియాస్ బాలరాజ్ (అభిమన్యు సింగ్) కూడా ఉంటాడు. ఆయన సోదరి ప్రియదర్శిని రామ్‌దాస్ (మంజు వారియర్) ఈ నిర్ణయాన్ని అంగీకరించదు. ఈ క్రమంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఖురేషి అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) రంగంలోకి దిగుతాడు. అయితే, అతడు ఓ డ్రగ్ దందాలో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. స్టీఫెన్ రాకతో కేరళ రాజకీయాల్లో ఎలాంటి మార్పు జరుగుతుంది? బాలరాజ్‌తో అతడి వైరం ఏమిటి? జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్)తో బాలరాజ్‌కు కనెక్షన్ ఏమిటి? అనేవి తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
మోహన్ లాల్ నటన సినిమాకి ప్రధాన బలం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది.పృథ్వీరాజ్ దర్శకత్వం, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, దీపక్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్స్.కొన్ని సీన్లు సాగదీసినట్టుగా అనిపిస్తాయి.కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా బలంగా తీసుంటే బాగుండేది.
తీర్పు:
లూసిఫర్ చిత్రం యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే 'ఎల్2: ఎంపురాన్' (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాకి ప్రధాన బలం మాత్రం సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీనే. విజువల్స్ అయితే అదిరిపోయాయి. అలానే దీపక్ దేవ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని బాగా ఎలివేట్ చేసింది. టెక్నికల్‌గా అయితే సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి డైరెక్టర్‌గా తన పని సమర్థవంతంగా చేశారు.
రేటింగ్: 2.75/5.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications