చిన్న సినిమాకి అవార్డుల పంట.. ఏకంగా 13 కేటగిరి లలో !
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కూడా ఒకటి. కాగా ఈ ఏడాది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ఫిల్మ్‌ఫేర్ ఉత్సవానికి ఆతిథ్యమిచ్చింది. ఈ సంవత్సరం కూడా భారీగా అలంకరించిన వేదిక.. లేజర్ లైట్స్, గ్రాండ్ రెడ్ కార్పెట్ ఎంట్రీలతో ఈ వేడుక ఒక అంతర్జాతీయ ఈవెంట్‌ను తలపించింది. ఈ వేడుకకు షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ హోస్ట్‌లుగా వ్యవహరించారు.
'లాపతా లేడీస్'..
లాపతా లేడీస్.. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ సహా పలువురు ముఖ్య పత్రాలు పోషించిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు. సామాజిక సందేశం, గ్రామీణ వాతావరణం.. కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఈ మూవీ ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 25 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

13 విభాగాల్లో అవార్డులు..
ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌లో సైతం 'లాపతా లేడీస్' సత్తా చాటింది. ఏకంగా మొత్తం 13 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. అవి..
ఉత్తమ చిత్రం (Best Film)
ఉత్తమ దర్శకురాలు (Best Director) - కిరణ్ రావు
ఉత్తమ స్క్రీన్‌ప్లే
ఉత్తమ డైలాగ్స్
ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఉత్తమ ఎడిటింగ్
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ -
సహా మరికొన్ని సాంకేతిక విభాగాల్లో విజేతగా నిలిచింది. అంతే కాకుండా ఫిల్మ్‌ఫేర్ 2025లో అత్యధిక అవార్డులు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ఇండియా తరపున ఆస్కార్ రేసులో కూడా నిలిచిన ఈ చిత్రం అవార్డు మాత్రం గెలుచుకో లేకపోయింది.
మరోవైపు ఉత్తమ నటుడు విభాగంలో అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ అవార్డు లను దక్కించుకోగా.. ఉత్తమ నటి విభాగంలో అలియా భట్ అవార్డును గెలుచుకుంది. కాజోల్, కృతి సనన్, అనన్య పాండే, విక్కీ కౌశల్, జాన్ అబ్రహం లు తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలానే సినీ రంగానికి జీవితాంతం చేసిన సేవలకు గాను సీనియర్ నటి జీనత్ అమన్ మరియు దివంగత దర్శకుడు శ్యామ్ బెనెగల్ లకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications