ఐ బొమ్మలో ప్రత్యక్షమైన రూ.300 కోట్ల సినిమా

ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది.

ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌ బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో సూపర్ హిట్ సినిమా అందుబాటులోకి వచ్చింది.

latest block blast movie streaming in iBOMMA

ఆ సినిమా మరేదో కాదు... 'మహావతార్ నరసింహ'. సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న చిత్రం 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక కథ కాదు, అసాధారణమైన గ్రాఫిక్స్, అద్భుతమైన కథా కథనంతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మహావతార్ నర్సింహా సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన విజయం సాధించి, ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక యానిమేషన్ సినిమాగా విడుదలై, ఇది సాధించిన విజయం అనితరసాధ్యం.

ఈ సినిమా సుమారుగా రూ. 30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో ఈ సినిమాలను అల్లు అరవింద్ విడుదల చేశారు. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 300 కోట్ల మార్కును దాటి, కలెక్షన్లలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా సాధించిన లాభాలు బడ్జెట్‌తో పోలిస్తే అనేక రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ విజయం భారతీయ యానిమేషన్ చిత్రాలకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది.

మహావతార్ నర్సింహా సినిమా విజయం కేవలం దాని కలెక్షన్లలోనే లేదు, ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ఆదరణలో ఉంది. ఈ సినిమా ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైంది. కేవలం మౌత్ టాక్ ద్వారానే దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కథ, కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, నరసింహ స్వామి కథను ఎంతో శక్తివంతంగా, భావోద్వేగంగా చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా యానిమేషన్ కేవలం పిల్లల కోసమే కాదు, పెద్దలు కూడా చూడవచ్చు అని నిరూపించింది. తాజాగా ఈ సినిమా ఐబొమ్మలో ప్రత్యక్షం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+