బేబీ బంప్‌తో షాకిచ్చిన మెగా కోడలు
హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.
ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది. 2023 నవంబర్ 1న వీరిద్దరు ఒకటయ్యారు.పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఇక లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తాను తల్లి కాబోతున్నట్టు మెగా కోడలు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్ కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషెష్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది లావణ్య త్రిపాఠి. భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట పోస్ట్ చేసింది. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చింది. గర్భవతైన తర్వాత తొలిసారి ఆమె ఇలా బేబీ బంప్‌తో కనిపించింది. భర్త వరుణ్‌తో కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications