గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు...మేం ముగ్గురు కాబోతున్నాం
మెగా ఇంటికి బుల్లి వారసుడు రాబోతున్నాడు. అవును మీరు వింటుంది నిజమే. తాను తల్లి కాబోతున్నట్టు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రకటించారు. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్ కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషెష్‌లు పెడుతున్నారు. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.
{image- telugu.oneindia.com}
నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.












Click it and Unblock the Notifications