గ్లామర్ డోస్ పెంచిన మెగా కోడలు..ఎద అందాలతో రచ్చ

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది. అందానికి అందం, టాలెంట్‌కు రెండూ ఉన్నా అమ్మడకు మాత్రం సరైన సక్సెస్ రాలేదు. ఫ్లాప్‌లు మీద ఫ్లాప్‌లు వెంటాడాయి. దీంతో రేసులో బాగా వెనుక పడిపోయింది. ఇదే సమయంలో మెగా హీరో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది.

మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో. లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది.

Lavanya Tripathi latest hot looks goes viral

2023 నవంబర్ 1న వీరిద్దరు ఒకటయ్యారు.పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు.ఆ మధ్య 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.ఇది డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లావణ్య ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కొంచెం బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చింది. గోల్డ్ కలర్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది. రెడ్ కలర్ లిప్‌ స్టిక్ వేసుకుని కొంచెం హాట్‌గా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది.

ముఖ్యంగా ఎద అందాలు కనిపించేలా ఇచ్చేలా ఫోజుల అయితే హైలెట్ అని చెప్పాలి. ఈ ఫొటోలు చూసిన నెటిజర్లు మెగా కోడలు ఇంత హాటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.లావణ్య త్రిపాఠి ప్రస్తుతం 'సతీ లీలావతి' అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తుండగా,తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ తర్వాత ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+