పెళ్లి తర్వాత సమంతలా మారిపోయిన లావణ్య త్రిపాఠి జీవితం..?
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. అయితే నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంతకు పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం నాగ చైతన్యతో మాత్రమే సినిమాలు చేసింది. ఆ తర్వాత మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి..కొంతకాలం సినిమాలకు దూరం అయింది.

అయితే ఇటీవలే తిరిగి కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే పెళ్లి తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి జీవితం కూడా సమంతలా మారిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.
షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. గతేడాది నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. పెళ్లి తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.పెద్దింటి కోడళ్లు అయ్యాక హీరోయిన్స్ దుస్థితి ఇలాగే మారుతుందా? అని పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి.












Click it and Unblock the Notifications