ఫ్యామిలీ బండారం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరితోనూ లావణ్య త్రిపాఠి నటించింది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. ''మిస్టర్'', ''అంతరిక్షం'' సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.
ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా వెళ్లింది. నవంబర్ 1న వీరిద్దరు ఒకటయ్యారు.పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సీక్రెట్ బయటపెట్టింది.
''మీ ఫ్యామిలీకి సంబంధించిన రహస్య ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అది వండర్‌ఫుల్‌గా పని చేస్తుంది. ఒకేసారి మీ టాన్‌ను తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. టాప్ సీక్రెట్'' అనే క్యాప్షన్‌ను జత చేసింది. ఈ పోస్ట్ ద్వారా మెగా కోడలు హోమ్‌లో ఉంటూనే బ్యూటీ టిప్స్ అద్భుతంగా పని చేస్తాయని చెప్పింది. అలాగే కొన్ని ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా ఇన్‌స్టాలో పెట్టింది. ప్రస్తుతం లావణ్య చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications