వచ్చే జన్మలో పెళ్లి చేసుకుందాం ..లావణ్య త్రిపాఠి షాకింగ్ పోస్ట్

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.

నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.

lavanya tripathi shocking reply to netizen

ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.మీ లెగ్‌కి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ ఆరాలు తీయసాగారు.తనకు బాగానే ఉందని, కాస్త బెణికిందని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది.అనంతరం మరో నెటిజన్ మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే.పవర్ అని రిప్లై ఇచ్చింది.

lavanya tripathi shocking reply to netizen

ఇంతలో ఒక నెటిజన్ వింతగా ప్రపోజ్ చేశాడు.ఈ జన్మలోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.కానీ కుదర్లేదు. వచ్చే జన్మలో అయినా చేసుకుందాం అని అడిగగా.లావణ్య త్రిపాఠి స్పందిస్తూ. హిందూ మత విశ్వాసం ప్రకారం.పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. పైగా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతారు అని వరుణ్ తేజ్ తనకు ఏడు జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది.లావణ్య తెలివిగా ఆన్సర్ ఇచ్చిందంటూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+